ఏపీ డిప్యూటీ స్పీకర్‌కు కరోనా పాజిటివ్
ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ స్పీకర్, బాపట్ల ఎమ్మెల్యే కోన రఘుపతికి కరోనా వైరస్ సోకింది. ఆయన ఈ విషయాన్ని అధికారికంగా ధ్రువీకరించారు. కోన రఘుపతితో పాటు భార్య, కుమార్తెకు కూడా కోవిడ్ నిర్థారణ అయింది. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా ఫేస్‌బుక్‌లో..
ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ స్పీకర్, బాపట్ల ఎమ్మెల్యే కోన రఘుపతికి కరోనా వైరస్ సోకింది. ఆయన ఈ విషయాన్ని అధికారికంగా ధ్రువీకరించారు. కోన రఘుపతితో పాటు భార్య, కుమార్తెకు కూడా కోవిడ్ నిర్థారణ అయింది. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా ఫేస్‌బుక్‌లో వీడియో పోస్ట్ చేశారు డిప్యూటీ స్పీకర్ కోన రఘుపతి. వీడియోలో స్పీకర్ మాట్లాడుతూ.. ‘ఈ రోజు జ్వరం రావడంతో కరోనా టెస్టులు చేయించాం. రిపోర్టులో పాజిటివ్ వచ్చింది. దీనికి కంగారు పడాల్సిన పనిలేదు. వారం రోజులు హోం క్వారంటైన్‌లో ఉండాలని వైద్యులు సూచించినట్లు చెప్పారు. దీంతో నేను ప్రభుత్వ కార్యక్రమాలను వాయిదా వేస్తున్నాను. నేను ప్రస్తుతం ధైర్యంగా ఉన్నాను. కేవలం మాకు మైల్డ్ లక్షణాలు మాత్రమే ఉన్నాయి. కాబట్టి ఎలాంటి ఇబ్బంది లేదు. వారం రోజుల్లోనే మళ్లీ కలుద్దాం’. అంటూ ఓ వీడియోను పోస్ట్ చేశారు.
కాగా ప్రస్తుతం ఏపీలో కరోనా వైరస్ వ్యాప్తి కొనసాగుతోంది. తాజాగా ఇవాళ 8,555 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీనితో రాష్ట్రంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య లక్షా 58 వేల 764కి చేరుకుంది. వీటిల్లో 74,404 యాక్టివ్ కేసులు ఉండగా.. 82,886 మంది కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. కాగా ఇప్పటివరకూ రాష్ట్ర వ్యాప్తంగా 1474 మంది మరణించారు.
Read More:
కేంద్ర మంత్రి అమిత్‌షాకు కరోనా పాజిటివ్
వాట్సాప్‌లో అదిరిపోయే అప్‌డేట్.. 138 కొత్త ఎమోజీలు..
‘క్యాస్టింగ్ కౌచ్’పై నటి ప్రగతి సంచలన కామెంట్స్..
సీఎం జగన్‌కు చెన్నైవాసి అరుదైన కానుక.. బంగారు, వెండితో మసీదు!