ఆంధ్రప్రదేశ్‌లో కరోనా తీవ్రత కొనసాగుతోంది. కొత్తగా 24 గంటల వ్యవధిలో రాష్ట్ర వ్యాప్తంగా 74,453 పరీక్షలు నిర్వహించగా.. 4,169 కేసులు వెలుగుచూశాయి. తాజా కేసులతో కలిపి ఇప్పటివరకు రాష్ట్రంలో 18,57,352 మంది వైరస్ బారినపడినట్లు రాష్ట్ర వైద్యారోగ్య శాఖ బులిటెన్‌లో తెలిపింది. కొత్తగా 24 గంటల వ్యవధిలో 53 మంది బాధితులు కరోనా కారణంగా ప్రాణాలు విడిచారు. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా మృతుల సంఖ్య 12,416కి చేరింది. కొత్తగా 8,376 మంది బాధితులు కోలుకున్నారు. ఫలితంగా రాష్ట్రంలో మొత్తం రికవరీల సంఖ్య 17,91,056కి చేరినట్లు వైద్యారోగ్య శాఖ వెల్లడించింది. ప్రస్తుతం రాష్ట్రంలో 53,880 యాక్టివ్ కేసులున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటివరకు 2,12,80,302 శాంపిల్స్ ఆరోగ్య శాఖ పరీక్షించింది. అత్యధికంగా తూర్పుగోదావరి జిల్లాలో 743, పశ్చిమ గోదావరిలో 659, చిత్తూరులో 472 కొవిడ్ కేసులు నమోదయ్యాయి. చిత్తూరు జిల్లాలో 7, ప్రకాశం, తూర్పుగోదావరి జిల్లాలో ఆరుగురు చొప్పున మరణించారు. కృష్ణా, శ్రీకాకుళం జిల్లాల్లో ఐదుగురు మృతి చెందారు.
#COVIDUpdates: 22/06/2021, 10:00 AM
రాష్ట్రం లోని నమోదైన మొత్తం 18,54,457 పాజిటివ్ కేసు లకు గాను
*17,88,161 మంది డిశ్చార్జ్ కాగా
*12,416 మంది మరణించారు
* ప్రస్తుతం చికిత్స పొందుతున్నవారి సంఖ్య 53,880#APFightsCorona #COVID19Pandemic pic.twitter.com/DxdqJa5xG7— ArogyaAndhra (@ArogyaAndhra) June 22, 2021
దేశంలో రోజువారీ కరోనా కేసుల సంఖ్య క్రమంగా తగ్గుతూ వస్తోంది. కొత్తగా 42,640 మంది వైరస్ బారిన పడ్డారు. గడిచిన 91 రోజుల్లో ఇవే అత్యల్ప రోజువారీ కేసులు కావడం గమనార్హం. కాగా,మహమ్మారి ధాటికి మరో 1,167 మంది ప్రాణాలు కోల్పోయారు. వైరస్ నుంచి 81,839 మంది కోలుకున్నారు.
సోమవారం ఒక్కరోజే 16,64,360 శాంపిల్స్ పరీక్షించినట్లు భారత వైద్య పరిశోధనా మండలి(ఐసీఎంఆర్) తెలిపింది. దీంతో ఇప్పటివరకు చేసిన మొత్తం పరీక్షల సంఖ్య 39,40,72,142కు చేరింది.
Also Read: యువతిపై అత్యాచార ఘటనపై స్పందించిన సీఎం జగన్..