సుశాంత్ కుటుంబ సభ్యులను పరామర్శించిన మాజీ ప్రేయసి

|

Jun 16, 2020 | 5:52 PM

బాలీవుడ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ఇంటికి అతని మాజీ ప్రేయసి అంకిత లోఖండే వెళ్లారు. చివరి చూపులు చూడాలని భావించినా.. క‌రోనా నిబంధనల నేప‌థ్యంలో ఆ అవకాశం దక్కలేదు. అయితే అంత్యక్రియ‌ల తర్వాత సుశాంత్ ఇంటికి వెళ్ళి వారి కుటుంబ సభ్యులను ప‌రామ‌ర్శంచి.. ప్ర‌గాఢ సానుభూతి తెలిపారు. సుశాంత్.. 2009లో హిందీలో ప్రారంభమైన పవిత్ర రిశ్తా అనే టీవీ సీరియల్ ద్వారా బుల్లితెరకు పరిచయమయ్యారు. ఏక్తా కపూర్ నిర్మించిన ఈ సీరియల్‌లో సుశాంత్ ప్రధాన పాత్ర […]

సుశాంత్ కుటుంబ సభ్యులను పరామర్శించిన మాజీ ప్రేయసి
Follow us on

బాలీవుడ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ఇంటికి అతని మాజీ ప్రేయసి అంకిత లోఖండే వెళ్లారు. చివరి చూపులు చూడాలని భావించినా.. క‌రోనా నిబంధనల నేప‌థ్యంలో ఆ అవకాశం దక్కలేదు. అయితే అంత్యక్రియ‌ల తర్వాత సుశాంత్ ఇంటికి వెళ్ళి వారి కుటుంబ సభ్యులను ప‌రామ‌ర్శంచి.. ప్ర‌గాఢ సానుభూతి తెలిపారు.

సుశాంత్.. 2009లో హిందీలో ప్రారంభమైన పవిత్ర రిశ్తా అనే టీవీ సీరియల్ ద్వారా బుల్లితెరకు పరిచయమయ్యారు. ఏక్తా కపూర్ నిర్మించిన ఈ సీరియల్‌లో సుశాంత్ ప్రధాన పాత్ర పోషించి టీవీ ఆడియెన్స్‌ని మెప్పించారు. ఇదే సీరియల్‌లో సుశాంత్‌కి జోడీగా నటించారు. అయితే అదే సమయంలో కొంతకాలం అంకిత లోఖండేతో సుశాంత్‌ ప్రేమాయణం నడిచినట్లుగా రూమర్స్ ఉన్నాయి. దాదాపు ఆరేళ్లపాటు వీరి బంధం కొనసాగింది. ఆ తర్వాత బాలీవుడ్‌లో కొంత బిజీగా మారటంతో ఇద్దరి మధ్య గ్యాప్ వచ్చింది. ఇంతలో అంకిత లోఖండేకు మరొకరితో ఎంగేజ్‌మెంట్ అయినట్లుగా వార్తలు వచ్చాయి.