Corona: ఏపీలో భారీగా పెరిగిన కరోనా కేసులు.. గత 24 గంటల్లో ఎన్ని నమోదయ్యాయంటే?

|

Mar 24, 2021 | 8:57 PM

AP Covid-19 cases: దేశవ్యాప్తంగా కరోనా కేసుల రోజురోజుకూ భారీగా పెరుగుతోంది. దీంతోపాటు తెలుగు రాష్ట్రాల్లో కూడా కరోనా కేసులు విజృంభిస్తున్నాయి. ఇటీవల తగ్గుముఖం

Corona: ఏపీలో భారీగా పెరిగిన కరోనా కేసులు.. గత 24 గంటల్లో ఎన్ని నమోదయ్యాయంటే?
ap-corona updates
Follow us on

AP Covid-19 cases: దేశవ్యాప్తంగా కరోనా కేసుల రోజురోజుకూ భారీగా పెరుగుతోంది. దీంతోపాటు తెలుగు రాష్ట్రాల్లో కూడా కరోనా కేసులు విజృంభిస్తున్నాయి. ఇటీవల తగ్గుముఖం పట్టిన కరోనా కేసులు కాస్త.. మళ్లీ పెరుగుతుండటంతో ఇరు రాష్ట్రాల్లో ఆందోళన నెలకొంది. ఏపీలో కూడా కరోనా కేసుల సంఖ్య భారీగా పెరిగింది. ఇటీవల 300లకే పరిమితమైన కేసులు కస్తా 500లకు పెరిగాయి. గడిచిన 24 గంటల్లో ఆంధ్రప్రదేశ్‌లో 585 కరోనా కేసులు నిర్ధారణ అయ్యాయి. దీంతోపాటు చిత్తూరు, కర్నూలు, విశాఖపట్నం జిల్లాల్లో ఒక్కొక్కరు చొప్పున (3) మరణించారు. తాజాగా నమోదైన కేసులతో కలిపి రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 89,51,121 కి పెరిగింది. దీంతోపాటు ఈ మహమ్మారి కారణంగా మరణించిన వారి సంఖ్య 7,197 కి చేరింది. ఈ మేరకు ఆంధ్రప్రదేశ్ వైద్య ఆరోగ్య శాఖ బుధవారం సాయంత్రం హెల్త్ బులెటిన్‌ను విడుదల చేసింది.

కాగా.. గడిచిన 24 గంటల్లో 251 మంది కరోనా మహమ్మారి నుంచి కోలుకున్నారు. వీరితో కలిపి ఇప్పటివరకు రాష్ట్రంలో కోలుకున్న వారి సంఖ్య 8,84,978 కి పెరిగింది. ప్రస్తుతం రాష్ట్రంలో 2,946 యాక్టివ్‌ కేసులున్నట్లు ఆరోగ్య శాఖ వెల్లడించింది. ఇదిలాఉంటే.. గత 24 గంటల్లో 35,066 కోవిడ్ నిర్ధారణ పరీక్షలు చేశారు. వీటితో కలిపి ఇప్పటివరకు రాష్ట్రంలో 1,48,40,401 కరోనా శాంపిళ్లను పరీక్షించినట్లు ఏపీ ఆరోగ్య శాఖ వెల్లడించింది.


Also Read:

Gold Seized: అస్సాం టూ హైదరాబాద్‌.. గోల్డ్‌ స్మగ్లర్ల గుట్టురట్టు.. 12 కోట్ల విలువైన బంగారం స్వాధీనం

పశ్చిమగోదావరి జిల్లాలో విషాద ఘటన.. ఏం కష్టమొచ్చిందో ఏమో కుటుంబం మొత్తం సూసైడ్.. వివరాలు ఇలా..