Andhra Corona Cases: ఏపీలో కొత్త‌గా 12,994 పాజిటివ్ కేసులు.. మ‌ర‌ణాలు, పాజిటివ్ కేసుల వివ‌రాలు

|

May 24, 2021 | 5:50 PM

ఏపీలో క‌రోనా తీవ్రత కొనసాగుతుంది. కొత్త‌గా రాష్ట్రంలో 58,835 శాంపిల్స్ టెస్ట్ చేయ‌గా.. 12,994 పాజిటివ్ కేసులు న‌మోద‌య్యాయి. క‌రోనా వ‌ల్ల కొత్త‌గా

Andhra Corona Cases: ఏపీలో కొత్త‌గా 12,994 పాజిటివ్ కేసులు.. మ‌ర‌ణాలు, పాజిటివ్ కేసుల వివ‌రాలు
Ap Corona
Follow us on

ఏపీలో క‌రోనా తీవ్రత కొనసాగుతుంది. కొత్త‌గా రాష్ట్రంలో 58,835 శాంపిల్స్ టెస్ట్ చేయ‌గా.. 12,994 పాజిటివ్ కేసులు వెలుగుచూశాయి. తాజా కేసులతో కలిసి ఇప్పటివరకు కరోనా సోకిన వారి సంఖ్య 15,93,821కి చేరింది. తాజాగా 96 మరణాలు న‌మోద‌య్యాయి. క‌రోనా వ‌ల్ల కొత్త‌గా చిత్తూరులో 14, క‌ర్నూల్‌లో 10, విజ‌య‌న‌గ‌రంలో 10, అనంత‌పూర్‌లో 9, తూర్పుగోదావరిలో 8, విశాఖ‌ప‌ట్నంలో 8, గుంటూరులో 7,  కృష్ణలో 7, నెల్లూరులో7, శ్రీకాకుళంలో 7, ప‌శ్చిమ గోదావ‌రిలో4, ప్రకాశంలో 3, క‌డ‌ప‌లో 2 మ‌ర‌ణాలు న‌మోద‌య్యాయి. ఇప్పటివరకు ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య 10,222కి పెరిగింది. రాష్ట్రంలో ప్రస్తుతం 2,03,762 కరోనా యాక్టివ్ కేసులు ఉన్నాయి. తాజాగా 18,373 మంది కరోనా నుంచి కోలుకున్నారని రాష్ట్ర వైద్యారోగ్య శాఖ‌ బులిటెన్‌లో వెల్ల‌డించింది.

తాజా కేసుల‌పై ఏపీ కోవిడ్ కమాండ్ కంట్రోల్ అధికారి అర్జా.శ్రీకాంత్ వివ‌ర‌ణ‌…

కరోనా కాస్త తగ్గుముఖం పట్టినట్లు అనిపిస్తోంది. పాజిటివ్ రేటు 25.5 % నుండి 22.08% కు తగ్గింది. కోవిడ్ టెస్టులు తక్కువ చేయటం వలన ఈరోజు పాజిటివ్ కేసుల సంఖ్య తక్కువగా ఉంది

కొత్త‌గా  నమూనా పరీక్షలు: 58835
కొత్త‌గా కోవిడ్ పాజిటివ్ కేసులు : 12994

ప్ర‌జంట్ పాజిటివ్ రేట్ : 22.08%

తాజా మరణాలు : 96
మరణాలు ఇంకా తగ్గలేదు.

అధిక మరణాలు: చిత్తూరు 14

అత్యధిక కేసులు: తూర్పు గోదావరి (2652)

మిగిలిన జిల్లాలలో కాస్త అదుపులోకి వచ్చాయి

కరోనా యాక్టివ్ కేసులు: 203762

కరోన *మృతులు*
ఇప్పటివరకు: 10222 (0.64%).
కరోనా వల్ల మృతుల సంఖ్య పది వేలు దాటింది

రికవరీ 15.93 లక్షల కేసుల‌లో 13.79లక్షల మంది రికవర్ అయ్యారు. (86.57%)

రికవరీ శాతం కూడా కొద్దిగా పెరిగింది

 

Also Read: చెల‌రేగిన నెల్లూరు కుర్రాళ్లు.. ‘వకీల్​సాబ్’ ఫైట్ సీన్‌ను యాజిటీజ్ దించేశారు

తెలంగాణ‌లోని ప్రైవేటు పాఠశాలల బోధన, బోధనేతర సిబ్బందికి గుడ్ న్యూస్.. ఖాతాల‌లోకి నేరుగా డ‌బ్బు జ‌మ‌