కరోనా….’గుల్లయిన’ అమెజాన్ బాస్ ఖజానా.. కోట్లాది డాలర్ల లాస్

కరోనా వైరస్ కారణంగా ప్రపంచ కుబేరుల్లో అనేకమంది వ్యాపారాలు దెబ్బతిన్నాయి. కరోనాతో బాటు వాణిజ్య కార్యకలాపాలు స్తంభించడంతో గత కొన్ని రోజుల్లోనే వీరి సొమ్ము కరిగిపోయింది.

  • Umakanth Rao
  • Publish Date - 6:41 pm, Wed, 4 March 20
కరోనా....'గుల్లయిన' అమెజాన్ బాస్ ఖజానా.. కోట్లాది డాలర్ల లాస్

కరోనా వైరస్ కారణంగా ప్రపంచ కుబేరుల్లో అనేకమంది వ్యాపారాలు దెబ్బతిన్నాయి. కరోనాతో బాటు వాణిజ్య కార్యకలాపాలు స్తంభించడంతో గత కొన్ని రోజుల్లోనే వీరి సొమ్ము కరిగిపోయింది. దాదాపు 500 మంది ధనికులకు సంబంధించిన 78 బిలియన్ డాలర్లు ఆవిరైపోయాయని ‘బ్లూమ్ బెర్గ్’ సంస్థ వెల్లడించింది. వీరిలో అమెజాన్ ఫౌండర్ జెఫ్ బెజోస్ కూడా ఉన్నారు. ఈ కొద్ధి  రోజుల్లోనే ఆయన సంపదలో 11.9 బిలియన్ డాలర్లు హారతి కర్పూరంలా హరించుకుపోయాయట.

2016 తరువాత  ఈ ఏడాది మొట్టమొదటిసారిగా ఈయన ఆధ్వర్యంలోని అమెజాన్ సంస్థ  ఆదాయపు పన్ను చెల్లించింది. ఇది సుమారు 162 మిలియన్ డాలర్లని , ఇక  బెవర్లీ లోని తన మేన్షన్ (భవనం) కోసం ఇతగాడు 165 మిలియన్ డాలర్లకు పైగా ఖర్చు చేశాడని బ్లూమ్ బెర్గ్ తెలిపింది. కరోనా వైరస్ ఈ కుబేరుని సంపాదనపై తీవ్ర ప్రభావం చూపిందని, సుమారు 12 బిలియన్ డాలర్ల నష్టాన్ని అమెజాన్ మూట గట్టుకుందని ఈ సంస్థ వెల్లడించింది. అయితే ఈ ధనికుడు తన గర్ల్ ఫ్రెండ్ లారెన్ సాంచెజ్ తో కలిసి అమెరికాలోని ఖరీదైన హోటళ్లను విజిట్ చేస్తూ ఎంజాయ్ చేస్తున్నాడు.