కరోనా వచ్చిందని భయపడుతున్నారా.. ఇలా తెలుసుకోండి!

ప్రస్తుతం కరోనా గురించి పెద్ద ఎత్తున చర్చ జరుగుతున్న వేళ తమకూ ఆ వైరస్ సోకిందేమోనన్న అనుమానం కొందరిలో కలుగుతోంది. సాధారణంగా వచ్చే జలుబుకు కూడా కొందరు తీవ్రంగా భయపడిపోతున్నారు. ఈ క్రమంలో అలాంటివారు తమకు ఎంత రిస్క్ ఉందో..

  • Tv9 Telugu
  • Publish Date - 11:20 am, Fri, 27 March 20
కరోనా వచ్చిందని భయపడుతున్నారా.. ఇలా తెలుసుకోండి!

మీలో మీకు కరోనా లక్షణాలు కనిపిస్తున్నాయా? ఎలా చెకింగ్ చేసుకోవాలి అని ఆలోచిస్తున్నారా? బయటకెళ్లాలా.. వద్దా! అనే సందేహంలో ఉన్నారా? భయపడకండి. ప్రస్తుతం కరోనా గురించి పెద్ద ఎత్తున చర్చ జరుగుతున్న వేళ తమకూ ఆ వైరస్ సోకిందేమోనన్న అనుమానం కొందరిలో కలుగుతోంది. సాధారణంగా వచ్చే జలుబుకు కూడా కొందరు తీవ్రంగా భయపడిపోతున్నారు. ఈ క్రమంలో అలాంటివారు తమకు ఎంత రిస్క్ ఉందో తెలుసుకునేందుకు ప్రముఖ టెలికాం సంస్థలు రిలయన్స్ జియో, ఎయిర్ టెల్ సెల్ఫ్ డయాగ్నోసిస్ టూల్స్‌ను తీసుకొచ్చాయి.

దీంతో మీ ఆరోగ్య స్థితి, వయసు, ఇతరత్రా వివరాలను బట్టి కరోనా వైరస్ ఉందో లేదో తెలుసుకోసువచ్చు. కరోనాపై పోరులో భాగంగా ఈ టూల్స్‌ను ఈ రెండు సంస్థలు ప్రజలు అందుబాటులో ఉంచాయి. వీటి కోసం సపరేటుగా ప్రత్యేక యాప్‌లు కేటాయించాయి.

జియో ప్రత్యేక యాప్:

కరోనాను తెలుసుకునేందుకు ప్రత్యేకమైన వెబ్‌సైట్‌ను https://covid.bhaarat.ai/  తీసుకొచ్చాయి. ‘మై జియో’ యాప్ ద్వారా మీకు ఎంత రిస్క్ ఉందో తెలుసుకోవచ్చు. ఈ యాప్ ద్వారా కేవలం హెల్త్ చెకపే కాకుండా దగ్గర్లోని ల్యాబ్‌ల వివరాలు, ప్రపంచ వ్యాప్తంగా కేసులకు సంబంధించిన గణంకాలను అందిస్తోంది.

అపోలోతో కలిసి ఎయిర్‌టెల్:

ఎయిర్‌టెల్ డబ్ల్యూహెచ్‌వో, కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ మార్గదర్శకాలను అనుసరించి అపోలో హాస్పిటల్స్ సహకారంతో ఓ టూల్ అభివృద్ధి చేసింది. ఎయిర్‌టెల్ థ్యాంక్స్ యాప్‌తో పాటు ప్రత్యేకంగా ఓ వెబ్‌సైట్‌ను https://airtel.apollo247.com/ అందుబాటులోకి తీసుకొచ్చింది.

ఈ లింక్స్‌లోకి వెళ్తే.. మీరు ఆరోగ్య సమస్యలతో పాటు.. కరోనాతో ఎంత రిస్క్ ఉందో ఈజీగా తెలుసుకోండి.

ఇవి కూడా చదవండి: తెలంగాణలో రేషన్ బియ్యం నిలిపివేత.. ఇదే కారణం..

ఏ లక్షణాలు లేకున్నా కరోనా వచ్చింది.. హైదరాబాద్ కోవిడ్ బాధితుడు చెప్పిన షాకింగ్ నిజాలు

జగన్ ప్రభుత్వానికి పవన్ మరో డిమాండ్.. ఈఎమ్‌ఐ చెల్లింపులు పొడిగించాలని..

వైరల్ న్యూస్: కరోనా ఉంది నాన్నా.. బయటకెళ్లొద్దంటూ.. బుడ్డోడి ఆవేదన

ఇది పచ్చి అబద్ధం.. ఈ సమయంలోనూ నాపై రూమర్లు ప్రచారం చేయడం దారుణం

ఏప్రిల్ 15 తరువాత కూడా లాక్‌డౌన్ కంటిన్యూ?

కరోనా వైరస్ తొందరగా వ్యాపించే ప్రదేశాలు ఇవే.. జాగ్రత్తగా ఉండండి!

కరోనా విజృంభణ: టీఆర్ఎస్ నేతల కీలక నిర్ణయం.. రూ.500 కోట్ల విరాళం

కరోనా ఎఫెక్ట్: పెరిగిన కండోమ్స్, ఐపిల్స్ సేల్స్