35 ప్రైవేట్ ల్యాబ్‌‌ల్లో క‌రోనా ప‌రీక్ష‌లు..హైద‌రాబాద్‌లో 5

క‌రోనా వైర‌స్ ప‌రీక్ష‌ల నిర్ధార‌ణ విష‌యంలో కేంద్రం మ‌రో కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. ప్ర‌భుత్వ ల్యాబ్‌లోనే నిర్వ‌హిస్తున్న క‌రోనా వైర‌స్ టెస్టులు ఇక‌పై 35 ప్రైవేటు ల్యాబ్‌ల్లోనూ నిర్వ‌హించేందుకు ..

35 ప్రైవేట్ ల్యాబ్‌‌ల్లో క‌రోనా ప‌రీక్ష‌లు..హైద‌రాబాద్‌లో 5

క‌రోనా వైర‌స్ ప‌రీక్ష‌ల నిర్ధార‌ణ విష‌యంలో కేంద్రం మ‌రో కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. ప్ర‌భుత్వ ల్యాబ్‌లోనే నిర్వ‌హిస్తున్న క‌రోనా వైర‌స్ టెస్టులు ఇక‌పై 35 ప్రైవేటు ల్యాబ్‌ల్లోనూ నిర్వ‌హించేందుకు తాజాగా అనుమ‌తులు జారీ చేసింది. అందులో భాగంగా తెలంగాణ‌లోని ఐదు ప్రైవేటు ఆస్ప‌త్రుల ల్యాబ్‌ల‌కు అవ‌కాశం ద‌క్కింది.

ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ తీవ్రత కొనసాగుతోంది. ఈ మహమ్మారి బారినపడి వేలాది మంది ఇప్పటికే ప్రాణాలు కోల్పోయారు. దాదాపు 300 కోట్ల మంది ప్రజలు నిర్బంధంలో కొనసాగుతున్నారు. వైర‌స్ నివ‌రాణ‌కు వ్యాక్సిన్ క‌నుగొనేందుకు ప్ర‌పంచ దేశాల శాస్త్ర‌వేత్త‌లు కృషిచేస్తున్నారు. మరోవైపు క‌రోనా వైరస్‌ను కట్టడిచేయడానికి చర్యలు తీసుకుంటున్నా వైరస్ మరణాలు, బాధితుల సంఖ్య మాత్రం తగ్గడంలేదు. ఈ నేప‌థ్యంలోనే ప్రైవేట్ ల్యాబ్‌లకు కూడా అనుమ‌తులు క‌ల్పిస్తూ కేంద్రం నిర్ణయం తీసుకుంది. ఇందుకోసం ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్(ICMR) అనుమతులు జారీ చేసింది. దేశవ్యాప్తంగా మొత్తం 35 మెడికల్ ల్యాబ్‌లకు అనుమతులు మంజూరు చేసింది.

కరోనా కేసులు ఎక్కువగా ఉన్న తొమ్మిది రాష్ట్రాల్లోని ప్రైవేట్ ల్యాబ్‌లకు పరీక్షలు నిర్వహించేందుకు కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇందులో తెలంగాణలోని 5 ల్యాబ్‌లకు అనుమతి లభించింది. ఏపీలోని ఏ ఆస్పత్రికి కూడా అనుమతి దక్కలేదు. తెలంగాణలో ఉన్న ఆస్పత్రుల్లో అన్నీ హైదరాబాద్‌కు చెందినవే. అందులో జూబ్లీహిల్స్ అపోలో, హిమాయత్ నగర్‌లోని విజయ డయాగ్న‌స్టిక్స్, ఐడీఏ చర్లపల్లిలోని విమతా ల్యాబ్స్, సికింద్రాబాద్ అపోలో, పంజాగుట్టలోని డాక్టర్ రెమెడీస్ ల్యాబ్స్ ఉన్నాయి.

Read Full Article

Click on your DTH Provider to Add TV9 Telugu