Senior Heroine Kushboo Eye Injury : సీనియర్ హీరోయిన్ కుష్బూ కంటికి గాయమైంది. బుధవారం ఉదయం తన కంటికి గాయమైన విషయాన్ని.. స్వయంగా ఆమెనే సోషల్ మీడియా యాప్ ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. ”హాయ్ ఫ్రెండ్స్.. ఈ రోజు ఉదయం పొరపాటున నా కంటికి కత్తి తగిలి చిన్నపాటి గాయమైంది. దీంతో డాక్టర్లు నా కంటికి ఆపరేషన్ చేసి కుట్లు వేసి, రెస్ట్ తీసుకోమన్నారు. దీంతో కొద్దికాలం పాటు ట్విట్టర్‌కు దూరంగా ఉండబోతున్నా. ప్రస్తుతం నేను బాగానే ఉన్నాను. త్వరలోనే మళ్లీ మీ ముందుకు తప్పకుండా వస్తాను. మీరందరూ తగిన జాగ్రత్తలు పాటిస్తూ.. మాస్క్ ధరిస్తూ.. భౌతిక దూరం పాటించండి” అంటూ కుష్బూ ట్వీట్ చేశారు.
ఇక కుష్బూ కంటికి గాయంతో ఉన్న ఫొటోను చూసిన పలువురు రాజకీయ నాయకులు, సెలబ్రిటీలు ఆమె క్షేమ సమాచారం తెలుసుకుంటున్నారు. ఇక అభిమానులు వరుస ట్వీట్లు పెడుతూ.. మీరు త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నాం అంటూ కామెంట్స్ చేస్తున్నారు.
Hi friends, will be inactive for a while as I had to go under a knife for my eye this morning.. promise to be back soon. Take care, wear a mask if heading out and maintain a distance. ❤ pic.twitter.com/K7d5plvsym
— KhushbuSundar ❤️ (@khushsundar) August 19, 2020
Also Read:
మెట్రో ఉద్యోగుల జీతభత్యాల్లో 50 శాతం కోత
నటి శివ పార్వతికి కరోనా పాజిటివ్.. ఎవరూ పట్టించుకోలేదంటూ ఆవేదన!