AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Coronavirus: త్వ‌ర‌లోనే భార‌త్‌లో రోజుకు 4 ల‌క్ష‌ల క‌రోనా కేసులు.. ఆసక్తిక‌ర విష‌యాలు వెల్ల‌డించిన ఐఐటీ ప్రొఫెస‌ర్‌.

Coronavirus: దేశంలో క‌రోనా థార్డ్ వేవ్ ఉగ్ర‌రూపం దాల్చుతోంది. రోజురోజుకీ కేసుల సంఖ్య విప‌రీతంగా పెరిగిపోతున్నాయి. ఆదివారం దేశ వ్యాప్తంగా ఏకంగా 2,71,202 కేసులు న‌మోదై ఆల్ టైమ్ రికార్డును చేరుకున్నాయి. వీటిలో 7,743 ఒమిక్రాన్ కేసులు న‌మోదు కావ‌డం...

Coronavirus: త్వ‌ర‌లోనే భార‌త్‌లో రోజుకు 4 ల‌క్ష‌ల క‌రోనా కేసులు.. ఆసక్తిక‌ర విష‌యాలు వెల్ల‌డించిన ఐఐటీ ప్రొఫెస‌ర్‌.
Narender Vaitla
|

Updated on: Jan 17, 2022 | 6:23 PM

Share

Coronavirus: దేశంలో క‌రోనా థార్డ్ వేవ్ ఉగ్ర‌రూపం దాల్చుతోంది. రోజురోజుకీ కేసుల సంఖ్య విప‌రీతంగా పెరిగిపోతున్నాయి. ఆదివారం దేశ వ్యాప్తంగా ఏకంగా 2,71,202 కేసులు న‌మోదై ఆల్ టైమ్ రికార్డును చేరుకున్నాయి. వీటిలో 7,743 ఒమిక్రాన్ కేసులు న‌మోదు కావ‌డం ఆందోళ‌న క‌లిగించే అంశం. దీంతో దేశంలో ప‌లు రాష్ట్రాలు క‌ఠినంగా నిబంధ‌న‌లు అమ‌లు చేస్తున్నాయి. ఇదిలా ఉంటే దేశంలో క‌రోనా పీక్స్‌కి ఎప్పుడు చేరుకుంటున్న‌దానిపై సర్వ‌త్ర చ‌ర్చ జ‌రుగుతోంది. ఈ నేప‌థ్యంలోనే ఐఐటీ కాన్‌పూర్‌కు చెందిన ప్రొఫెస‌ర్ డాక్ట‌ర్ మనింద్రా అగర్వాల్ ప‌లు ఆస‌క్తిక‌ర విష‌యాల‌ను పంచుకున్నారు.

మ‌నింద్రా అభిప్రాయం మేర‌కు జ‌న‌వరి 23 నాటికి దేశంలో క‌రోనా కేసులు గ‌రిష్ట స్థాయికి చేరుకుంటాయ‌ని చెబుతున్నారు. ఈ స‌మ‌యానికి దేశంలో రోజు 4 ల‌క్ష‌ల కేసులు నమోదుకానున్నాయ‌ని ఆయ‌న అభిప్రాయం. కేసులు ఈ స్థాయిలో పెరడానికి కార‌ణంగా.. జ‌నాభాలో మొత్తం రెండు ర‌కాల మ‌నుషులు ఉన్నారు. వారిలో ఒక‌రు త‌క్కువ రోగ నిరోధ‌క శ‌క్తి ఉన్న వారు. కొత్త మ్యూటెంట్‌లు వీరికి మొద‌ట వ్యాపిస్తుందని మ‌నింద్రా తెలిపారు. ఇక ఒమిక్రాన్ వ్యాప్తి మొద‌లైన తొలిరోజుల్లో చాలా గంద‌ర‌గోళానికి గుర‌య్యార‌ని కానీ గ‌త వారం రోజులుగా గ‌మనిస్తే ఈ వైర‌స్ బారిన ప‌డిన వారిలో చాలా త‌క్కువ తీవ్ర‌త‌తో ఉన్న ల‌క్ష‌ణాలు క‌నిపిస్తున్న‌ట్లు తేలిందని ఆయ‌న తెలిపారు.

ఒక్కో రాష్ట్రంలో ఒక్కోలా..

ఇక ప్రొఫెస‌ర్ అంచ‌నా మేర‌కు క‌రోనా కేసులు ఒక్కో రాష్ట్రంలో ఒక్కో స్థాయిలో గ‌రిష్ట స్థాయికి చేరుతాయ‌ని చెబుతున్నారు. ముఖ్యంగా దేశ ఆర్థిక రాజ‌ధాని ముంబ‌యిలో జ‌న‌వ‌రి 12 నాటికి చేరింద‌ని తెలిపారు. బెంగ‌ళూరులో జ‌న‌వ‌రి 22, అసోంలో జ‌న‌వ‌రి 26కి క‌రోనా కేసులు గ‌రిష్ట స్థాయికి చేరుకోనున్న‌ట్లు తెలిపారు. ఇక తెలుగు రాష్ట్రాల విష‌యానికొస్తే ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో జ‌న‌వ‌రి 30 నాటికి క‌రోనా కేసులు పీక్‌కు చేరుతాయ‌ట‌. ఇదిలా ఉంటే క‌రోనా బారిన ప‌డిన త‌ర్వాత రోగులు ఆసుప‌త్రుల్లో చేరే విష‌యంపై కూడా ప్రొఫెస‌ర్ స్పందించారు. క‌రోనా బారిన‌ప‌డి ఆసుప‌త్రుల్లో చేరే వారి సంఖ్య చాలా త‌క్కువ‌గా ఉంద‌ని తెలిపారు. క‌రోనా బారిన ప‌డిన వారిలో కేవ‌లం 1 శాతం మాత్ర‌మే ఆసుప‌త్రుల్లో చేరుతున్నార‌ని ప్రొఫెసర్ తెలిపారు.

Also Read: CM KCR tour: రేపు ఉమ్మడి వరంగల్ జిల్లాలో సీఎం కేసీఆర్ పర్యటన.. వర్షానికి దెబ్బతిన్న పంటల పరిశీలన!

సూర్యపై వేటు, గిల్‌కు నోఛాన్స్.. భారత టీ20 కెప్టెన్‌గా ఎవరంటే?
సూర్యపై వేటు, గిల్‌కు నోఛాన్స్.. భారత టీ20 కెప్టెన్‌గా ఎవరంటే?
గోల్డ్‌ లవర్స్‌కి బ్యాడ్‌ న్యూస్‌! ఆల్‌టైమ్ హైకి చేరుకున్న బంగారం
గోల్డ్‌ లవర్స్‌కి బ్యాడ్‌ న్యూస్‌! ఆల్‌టైమ్ హైకి చేరుకున్న బంగారం
రజినీకాంత్‏తో బ్లాక్ బస్టర్.. సైడ్ క్యారెక్టర్స్ మాత్రమే వచ్చాయి.
రజినీకాంత్‏తో బ్లాక్ బస్టర్.. సైడ్ క్యారెక్టర్స్ మాత్రమే వచ్చాయి.
Re-Entry 2025 కమ్ బ్యాక్ తో ఇండస్ట్రీని షేక్ చేస్తున్న స్టార్స్​!
Re-Entry 2025 కమ్ బ్యాక్ తో ఇండస్ట్రీని షేక్ చేస్తున్న స్టార్స్​!
రియల్​ లైఫ్​ కపుల్​ రీల్​ లైఫ్​లోనూ.. అంచనాలు పెంచేస్తున్నారుగా!
రియల్​ లైఫ్​ కపుల్​ రీల్​ లైఫ్​లోనూ.. అంచనాలు పెంచేస్తున్నారుగా!
ఐకాన్ స్టార్ ఇంట క్రిస్మస్ వెలుగులు.. షేర్ చేసిన స్నేహా రెడ్డి
ఐకాన్ స్టార్ ఇంట క్రిస్మస్ వెలుగులు.. షేర్ చేసిన స్నేహా రెడ్డి
సుదీర్ఘ విరామం తర్వాత వెండితెరపైకి సీనియర్ బ్యూటీ రీఎంట్రీ!
సుదీర్ఘ విరామం తర్వాత వెండితెరపైకి సీనియర్ బ్యూటీ రీఎంట్రీ!
ఇండియాలోనే మోస్ట్ సెర్చ్డ్ యాక్టర్స్.. టాప్ 10లో మన హీరోల హవా!
ఇండియాలోనే మోస్ట్ సెర్చ్డ్ యాక్టర్స్.. టాప్ 10లో మన హీరోల హవా!
Tollywood: నెపోటిజంపై టాలీవుడ్ యంగ్ హీరో సంచలన కామెంట్స్..!
Tollywood: నెపోటిజంపై టాలీవుడ్ యంగ్ హీరో సంచలన కామెంట్స్..!
Horoscope Today: వారి ఆదాయ వృద్ధి ప్రయత్నాలు సఫలం..
Horoscope Today: వారి ఆదాయ వృద్ధి ప్రయత్నాలు సఫలం..