Corona Rules: కరోనా నిబంధనలు ఉల్లంఘించినందుకు ఐదేళ్ళ జైలు శిక్ష! ఎక్కడో తెలుసా?

|

Sep 07, 2021 | 8:39 PM

ఇంత విధ్వంసం తరువాత కూడా ఇప్పటికీ కోవిడ్ నిబంధనలు పాటించడం అంటే కొందరు నిర్లక్ష్యం వహిస్తూనే వస్తున్నారు. ఇప్పటికీ కొంతమంది మాస్క్ లు పెట్టుకోకుండా తిరిగేస్తున్న వారిని మనం చూస్తూనే ఉన్నాం.

Corona Rules: కరోనా నిబంధనలు ఉల్లంఘించినందుకు ఐదేళ్ళ జైలు శిక్ష! ఎక్కడో తెలుసా?
Corona Rules Violation
Follow us on

Corona Rules: కరోనా ఎంత దారుణమైన మహమ్మారి అనేది అందరికీ తెలిసిందే. ప్రపంచ స్థితిని పూర్తిగా మార్చేసింది కరోనా. కంటికి కనిపించని వైరస్ కల్లోలాన్ని సృష్టించింది. ప్రభుత్వాలు అప్రమత్తమై అందరికీ ఎన్ని జాగ్రత్తలు చెప్పినా.. పెడచెవిన పెట్టినవారు పెడుతూనే వచ్చారు. ఇంత విధ్వంసం తరువాత కూడా ఇప్పటికీ కోవిడ్ నిబంధనలు పాటించడం అంటే కొందరు నిర్లక్ష్యం వహిస్తూనే వస్తున్నారు. ఇప్పటికీ కొంతమంది మాస్క్ లు పెట్టుకోకుండా రోడ్లపై యధేచ్చగా తిరిగేస్తున్న వారిని మనం చూస్తూనే ఉన్నాం. మాస్క్ పెట్టుకోకపోతే 500 జరిమానా.. 1000 రూపాయల జరిమానా అని కొన్ని ప్రభుత్వాలు హెచ్చరించినా.. లెక్కచేయకుండా తిరిగేస్తున్న వైనం మనకి తెలిసిందే. ఇదిగో ఈ వార్త అటువంటి వారి కోసమే. కోవిడ్ నిబంధనలు పాటించనందుకు ఒక వ్యక్తికి 5 సంవత్సరాలు కఠిన కారాగార శిక్ష విధించారు ఆ దేశంలో. అది ఎక్కడో ఏమిటో తెలుసుకుందాం..

కఠినమైన కోవిడ్ -19 నిర్బంధ నియమాలను ఉల్లంఘించినందుకు.. అతని పరిచయాల మధ్య వైరస్ వ్యాప్తి చేసినందుకు ఒక వ్యక్తికి వియత్నాంలో ఐదు సంవత్సరాల జైలు శిక్ష విధించారు. వియత్నాం నుండి వచ్చిన స్థానిక నివేదికల ప్రకారం, లె వాన్ ట్రై (28) ప్రజా కోర్టులో విచారణ తర్వాత “ప్రమాదకరమైన అంటు వ్యాధులను వ్యాప్తి చేసినందుకు” దోషిగా తేలింది. దీంతో అతనికి శిక్ష విధించారు.
“ట్రై హో చి మిన్ సిటీ నుండి తిరిగి కా మావు (Ca Mau)కి వెళ్లాడు.. అలాగే, 21 రోజుల క్వారంటైన్ నిబంధనలను ఉల్లంఘించాడు” అని స్టేట్ రన్ వియత్నాం న్యూస్ ఏజెన్సీ (VNA) వెల్లడించింది. ఇతని ఒక్కడికే కాదు.. ఇలాంటి ఆరోపణలపై దేశంలో మరో ఇద్దరు వ్యక్తులకు 18 నెలల, రెండు సంవత్సరాల సస్పెండ్ జైలు శిక్ష విధించారు.

నిజానికి కరోనా మొదటి వేవ్ సమయంలో వియత్నాం విజయవంతంగా కరోనా వ్యాప్తిని అడ్డుకుంది. అయితే, తరువాత దేశవ్యాప్తంగా కోవిడ్ పరిస్థితులు దిగజారిపోయాయి. వియత్నాం ప్రపంచంలో కరోనాను సమర్ధవంతంగా ఎదుర్కున్న అతి తక్కువ దేశాల్లో ఒకటి. ఇక్కడ సామూహిక పరీక్షలు.. దూకుడుగా క్వారంటైన్ నిబంధనలు అమలు పరచడం.. కఠినమైన సరిహద్దు ఆంక్షలు.. వియత్నాం ను ప్రత్యేకంగా నిలబెట్టాయి. అయితే, అకస్మాత్తుగా గత ఏప్రిల్ నెల నుంచి కరోనా అంటువ్యాధి అక్కడ పెరిగిపోయింది. మొదటి వేవ్ లో ఉన్న రికార్డును తుడిచి పెట్టేసింది. పరిస్థితి చాలా దారుణంగా దిగజారిపోయింది. ఈ నేపధ్యంలో మరింత కఠినంగా వ్యవహరిస్తోంది..

మరోవైపు, వియత్నాం యొక్క దక్షిణాన ఉన్న ప్రావిన్స్ అయిన కా మావు, మహమ్మారి ప్రారంభమైనప్పటి నుండి 191 కేసులు.. రెండు మరణాలు మాత్రమే నివేదించింది. ఇది దాదాపు 2,60,000 కేసులతో దేశంలోని కరోనావైరస్ కేంద్రమైన హో చి మిన్ నగరంలో 10,685 మరణాల కంటే చాలా తక్కువ. వియత్నాంలో కోవిడ్ -19 వ్యాప్తి తీవ్రతరం కావడంతో, మొత్తం 5,36,000 మందికి పైగా వ్యాధి బారిన పడ్డారు మరియు 13,385 మంది మరణించారు.

హో చి మిన్ సిటీ మరియు రాజధాని హనోయి తమ వయోజన నివాసితులందరికీ సెప్టెంబర్ 15 లోపు కనీసం ఒక్క షాట్ అయినా తప్పనిసరిగా టీకాలు వేయాలని ఆ దేశ ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఆదేశించింది.

Also Read: ఏకంగా ముఖ్యమంత్రి తండ్రినే అరెస్ట్ చేసిన పోలీసులు.. ఎక్కడ..? ఎందుకు..? పూర్తి వివరాలు