33 ఏళ్ల ప్రయత్నం..కరోనా అతడి కల నెరవేర్చింది

కరోనా మహమ్మారి ఇప్పుడు ప్రపంచ దేశాలకు కంటిమీద కునుకులేకుండా చేస్తోంది. వైరస్ వ్యాప్తి నేపథ్యంలో లాక్‌డౌన్ కారణంగా అనేక కార్యక్రమాలు వాయిదా పడ్డాయి. విద్యా, వ్యాపార, వాణిజ్య రంగాల్లోనూ కరోనా తీవ్ర సంక్షోభాన్ని నింపింది. కానీ,..

33 ఏళ్ల ప్రయత్నం..కరోనా అతడి కల నెరవేర్చింది
Follow us

|

Updated on: Jul 31, 2020 | 11:23 AM

కరోనా మహమ్మారి ఇప్పుడు ప్రపంచ దేశాలకు కంటిమీద కునుకులేకుండా చేస్తోంది. వైరస్ వ్యాప్తి నేపథ్యంలో లాక్‌డౌన్ కారణంగా అనేక కార్యక్రమాలు వాయిదా పడ్డాయి. విద్యా, వ్యాపార, వాణిజ్య రంగాల్లోనూ కరోనా తీవ్ర సంక్షోభాన్ని నింపింది. కానీ, హైదరాబాద్‌లో నివసిస్తున్న ఓ వ్యక్తికి మాత్రం కోవిడ్ ఎంతో మేలు చేసింది. ఆయన చిరకాల కోరికను తీర్చింది.

హైదరాబాద్‌కు చెందిన నూరుద్దీన్ అనే వ్యక్తి  గత 33 ఏళ్లుగా పదో తరగతి పరీక్షలు రాస్తున్నాడు. తొలిసారిగా 1987 సంవత్సరంలో పదో తరగతి పరీక్షలు రాశారు. అప్పుడు ఇంగ్లీష్‌లో ఫెయిల్ అయ్యారు. అప్పటి నుంచి ఆయన టెన్త్‌క్లాస్‌ ఎగ్జామ్స్ రాస్తూనే ఉన్నాడు..ఏటా పరీక్షలో పాస్ మార్కులైన 35 మార్కులకు దగ్గరగా వచ్చి ఆగిపోతున్నారు. ఇలా ప్రయత్నం చేస్తున్న క్రమంలోనే ఆయనకు 50 ఏళ్లు నిండిపోయాయి…దీంతో పరీక్షలకు దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం లేకుండా పోయింది. దీంతో ఎలాగైన పది పాస్ కావాలనే లక్ష్యంతో..ఓపెన్ స్కూల్ విధానంలో దరఖాస్తు చేసుకున్నారు. అందుకోసం రూ.3 వేలు ఫీజు కూడా చెల్లించారు. ఓపెన్ స్కూల్‌ విధానంలో అన్ని పరీక్షలూ రాయాల్సి వచ్చింది. కానీ, ఇక్కడే ఆయనకు కరోనా కలిసొచ్చింది.

కరోనా వైరస్ నేపథ్యంలో పాఠశాల పరీక్షలన్నీ రద్దు చేయటంతో నూరిద్దీన్‌కు బాగా కలిసొచ్చింది. అన్ని పరీక్షలు వాయిదా వేయటం..విద్యార్థులందరినీ పాస్ చేయటంతో నూరిద్దీన్ కూడా పది పాసైపోయారు. రెగ్యులర్ వాళ్లకు గతంలో నిర్వహించిన పరీక్షల ఆధారంగా పాస్ చేయగా, ఓపెన్ స్కూల్ విధానంలో అప్లై చేసిన వారికి మాత్రం అందరికీ 35 మార్కులు ఇచ్చి పాస్ చేసేశారు. దీంతో నూరుద్దీన్ అలనాటి కల కరోనా కారణంగా నెరవేరినట్లయింది.

శ్రీశైలం రోడ్డు మార్గంలో నల్లటి వింత ఆకారం.. దగ్గరికెళ్లి చూస్తే
శ్రీశైలం రోడ్డు మార్గంలో నల్లటి వింత ఆకారం.. దగ్గరికెళ్లి చూస్తే
రెండు రోజుల వ్యవధిలోనే మరో 200 మందికి గూగుల్ ఉద్వాసన.!
రెండు రోజుల వ్యవధిలోనే మరో 200 మందికి గూగుల్ ఉద్వాసన.!
అపర కుబేరుడు ఈ ఖైదీ.. సంపద విలువ రూ.3.60 లక్షల కోట్లు.
అపర కుబేరుడు ఈ ఖైదీ.. సంపద విలువ రూ.3.60 లక్షల కోట్లు.
ఆంధ్రాలో డబ్బు రాజకీయం.బస్సుల్లో తరలిపోతున్న కోట్లలో నోట్ల కట్టలు
ఆంధ్రాలో డబ్బు రాజకీయం.బస్సుల్లో తరలిపోతున్న కోట్లలో నోట్ల కట్టలు
విమానం టేకాఫ్‌ అయిన 10 నిమిషాలకే ఊహించని ప్రమాదం.. 170 మంది.!
విమానం టేకాఫ్‌ అయిన 10 నిమిషాలకే ఊహించని ప్రమాదం.. 170 మంది.!
మండుతున్న ఎండలనుంచి ఉపశమనం.. పుదుచ్చేరి ప్రభుత్వం వినూత్న ఆలోచన..
మండుతున్న ఎండలనుంచి ఉపశమనం.. పుదుచ్చేరి ప్రభుత్వం వినూత్న ఆలోచన..
తలనొప్పిగా ఉందన్నాడు.. మరుక్షణంలోనే ప్రాణాలు కోల్పోయాడు.!
తలనొప్పిగా ఉందన్నాడు.. మరుక్షణంలోనే ప్రాణాలు కోల్పోయాడు.!
గ్యాంగ్‌స్టర్‌ గోల్డీబ్రార్‌ బ్రతికే ఉన్నాడు.! వీడియో..
గ్యాంగ్‌స్టర్‌ గోల్డీబ్రార్‌ బ్రతికే ఉన్నాడు.! వీడియో..
రజనీకాంత్ బయోపిక్ వార్త వైరల్‌.. హీరో ఎవరంటే.!
రజనీకాంత్ బయోపిక్ వార్త వైరల్‌.. హీరో ఎవరంటే.!
16 కేజీలు తగ్గిన రిషబ్‌ పంత్.! కేవలం 5 ml ఆయిల్‌తో వంట..
16 కేజీలు తగ్గిన రిషబ్‌ పంత్.! కేవలం 5 ml ఆయిల్‌తో వంట..