AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

క‌రోనా పంజా.. ప్ర‌పంచ వ్యాప్తంగా పెరిగిపోతున్న పాజిటివ్ కేసులు

ప్ర‌పంచ వ్యాప్తంగా కరోనా మహమ్మారి స్వైర విహారం చేస్తున్న సంగతి తెలిసిందే. రోజు రోజుకీ కోవిడ్ మహమ్మారి వికృత రూపం దాల్చుతోంది. ఈ వైరస్ దెబ్బకు ఆర్థిక వ్యవస్థలన్నీ అతలాకుతలమయ్యాయి. రోజూ కొత్త‌గా కరోనా పాజిటీవ్ కేసుల సంఖ్య‌, మరణాల సంఖ్య‌ పెరుగుతూనే..

క‌రోనా పంజా.. ప్ర‌పంచ వ్యాప్తంగా పెరిగిపోతున్న పాజిటివ్ కేసులు
TV9 Telugu Digital Desk
|

Updated on: Jul 31, 2020 | 10:32 AM

Share

ప్ర‌పంచ వ్యాప్తంగా కరోనా మహమ్మారి స్వైర విహారం చేస్తున్న సంగతి తెలిసిందే. రోజు రోజుకీ కోవిడ్ మహమ్మారి వికృత రూపం దాల్చుతోంది. ఈ వైరస్ దెబ్బకు ఆర్థిక వ్యవస్థలన్నీ అతలాకుతలమయ్యాయి. రోజూ కొత్త‌గా కరోనా పాజిటీవ్ కేసుల సంఖ్య‌, మరణాల సంఖ్య‌ పెరుగుతూనే ఉన్నాయి. ఇక ఇప్ప‌టికే ప‌లువురు సినీ, రాజ‌కీయ‌ ప్ర‌ముఖులు, పోలీసులు, వైద్యులు ఈ వైర‌స్ బారిన ప‌డుతోన్న‌ విష‌యం తెలిసిందే. కాగా గ‌త 24 గంట‌ల్లో ప్ర‌పంచ వ్యాప్తంగా 2,86,350 కోవిడ్‌ కేసుల సంఖ్య న‌మోద‌వ్వ‌గా.. మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య‌ 1,74,76,105కి చేరింది. ఇక అలాగే ఇప్ప‌టివ‌ర‌కూ వ‌ర‌ల్డ్ వైడ్‌గా 6,76,759 మంది క‌రోనాతో మ‌ర‌ణించారు. ప్రస్తుతం 58,86,729 యాక్టీవ్ కేసులు ఉండగా, 1,16,15,376 మంది కోవిడ్‌తో కోలుకుని ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు.

ఇక అమెరికాలో క‌రోనా వైర‌స్ ఉగ్ర‌రూపం దాల్చుతోంది. రోజురోజుకీ కొత్తగా కరోనా కేసులు నమోదవుతున్నాయి. ప్ర‌స్తుతం అమెరికా వ్యాప్తంగా మొత్తం కోవిడ్ కేసుల సంఖ్య 46,34,985కి చేరింది. అలాగే ఈ వైరస్ వల్ల ఇప్పటివరకూ అమెరికాలో 1,55,285 మంది మృతి చెందారు. అలాగే 21,94,735 యాక్టీవ్ కేసులు ఉండగా, 22,84,965 మంది కోవిడ్ నుంచి కోలుకున్నారు. ఇక బ్రెజిల్, రష్యా, జర్మనీ, జపాన్, ఇంగ్లాండ్, స్పెయిన్, లండన్, పాకిస్తాన్, ఇటలీలో కరోనా కేసులు విపరీతంగా పెరుగుతూనే ఉన్నాయి.

అలాగే భారత్​లో కరోనా వ్యాప్తి తీవ్ర‌త‌రం అవుతోంది. రోజురోజుకు పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతోంది. క‌రోనా కేసుల్లో ప్ర‌పంచంలో 3వ స్థానానికి చేరింది ఇండియా. తాజాగా గడిచిన 24 గంటల్లో దేశ వ్యాప్తంగా కొత్తగా మరో 55,078 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో ఇప్పటి వరకు దేశ వ్యాప్తంగా నమోదైన కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 16,38,870కి చేరింది. ఇక ప్రస్తుతం దేశ వ్యాప్తంగా 5,45,318 యాక్టివ్ కేసులు ఉన్నాయి. అలాగే కరోనా నుంచి కోలుకుని 10,57,805 మంది ఆస్ప్రతుల నుంచి డిశ్చార్జ్ అయ్యారు. ఇక గడిచిన 24 గంటల్లో దేశ వ్యాప్తంగా కరోనా బారినపడి 779 మంది మరణించారు. దీంతో ఇప్పటి వరకు దేశ వ్యాప్తంగా కోవిడ్ మ‌హ‌మ్మారి బారిన‌పడి 35,747 మంది మరణించారు.

Follow Us
ఎయిర్ ఫ్రైయర్ వాడుతున్నారా? అయితే మీరు ఇది తెలుసుకోవాల్సిందే!
ఎయిర్ ఫ్రైయర్ వాడుతున్నారా? అయితే మీరు ఇది తెలుసుకోవాల్సిందే!
చాణక్య నీతి.. ఈ విషయాల్లో సిగ్గు పడితే నష్టమే!
చాణక్య నీతి.. ఈ విషయాల్లో సిగ్గు పడితే నష్టమే!
రక్షాబంధన్.. రాఖీ కట్టే సమయంలో చేయకూడని, చేయాల్సిన పనులివే!
రక్షాబంధన్.. రాఖీ కట్టే సమయంలో చేయకూడని, చేయాల్సిన పనులివే!
ఓటీటీని ఊపేస్తున్న రొమాంటిక్ మూవీ.. ట్రెండింగ్‏లో నంబర్ వన్..
ఓటీటీని ఊపేస్తున్న రొమాంటిక్ మూవీ.. ట్రెండింగ్‏లో నంబర్ వన్..
ఆ మ్యాచ్ గుర్తుకు వస్తే ఒళ్లంతా గూస్ బంప్సే..: సూర్యకుమార్ యాదవ్
ఆ మ్యాచ్ గుర్తుకు వస్తే ఒళ్లంతా గూస్ బంప్సే..: సూర్యకుమార్ యాదవ్
కిచెన్ సింక్ తరచూ జామ్ అవుతోందా? ఈ 3 వస్తువులతో నిమిషాల్లో క్లీన్
కిచెన్ సింక్ తరచూ జామ్ అవుతోందా? ఈ 3 వస్తువులతో నిమిషాల్లో క్లీన్
రెండు సార్లు బిగ్‌బాస్ ఆఫర్‌ను రిజెక్ట్ చేసిన హీరో.. ఈసారి పక్కా
రెండు సార్లు బిగ్‌బాస్ ఆఫర్‌ను రిజెక్ట్ చేసిన హీరో.. ఈసారి పక్కా
నువ్వెవడ్రా.. పెద్ద డాక్టర్‌వా! డాక్టర్‌పై రోగి కుమారుడు దాడి
నువ్వెవడ్రా.. పెద్ద డాక్టర్‌వా! డాక్టర్‌పై రోగి కుమారుడు దాడి
మా బిడ్డ వ్యాఖ్యలతో మాకేంటి సంబంధం.. కొండా మురళి సంచలన వ్యాఖ్యలు
మా బిడ్డ వ్యాఖ్యలతో మాకేంటి సంబంధం.. కొండా మురళి సంచలన వ్యాఖ్యలు
చక్కెర ధరలపై కేంద్రం గుడ్‌న్యూస్.. త్వరలో తగ్గే ఛాన్స్!
చక్కెర ధరలపై కేంద్రం గుడ్‌న్యూస్.. త్వరలో తగ్గే ఛాన్స్!