ఆఫ్ఘనిస్తాన్ నుంచి ఢిల్లీ చేరుకున్న 78 మందిలో 16 మందికి కోవిడ్-19 పాజిటివ్ అని తేలింది. వీరిలో ముగ్గురితో కేంద్ర మంత్రి హర్ దీప్ సింగ్ పురి కాంటాక్ట్ లోకి వచ్చారు. కాబూల్ నుంచి తమతో బాటు గురు గ్రంథ్ సాహిబ్ ప్రతులను తెచ్చిన వీరి నుంచి ఢిల్లీ విమానాశ్రయంలో వీటిని నిన్న స్వీకరించారు. ఈ కాపీలను ఆయన భక్తి ప్రపత్తులతో శిరసుపై పెట్టుకుని తీసుకువచ్చి గురుద్వారాకు చేర్చారు. అయితే ఈ 16 మందిలో ఎసింప్టోమాటిక్ లక్షణాలు ఉన్నాయని అధికారులు తెలిపారు. ఎందుకైనా మంచిదని ఈ 78 మందిని క్వారంటైన్ కి తరలించినట్టు వారు వెల్లడించారు. నజఫ్ గడ్ లోని చావ్లా కాంప్లెక్స్ లో వీరు 14 రోజులపాటు క్వారంటైన్ లో ఉండాలని వారు పేర్కొన్నారు. ఈ నెల 23 న ఆరోగ్య శాఖ జారీ చేసిన గైడ్ లైన్స్ ప్రకారం.. విదేశాల నుంచి..ముఖ్యంగా ఆఫ్ఘనిస్తాన్ నుంచి ఇండియా చేరిన వారికీ 14 రోజుల క్వారంటైన్ తప్పనిసరి.. ఇది అనివార్యమని ఈ శాఖ వివరించింది. ఇలా ఉండగా కాబూల్ నుంచి భారతీయులతో బాటు ఆఫ్ఘన్లను కూడా తరలించే ప్రయత్నాలను భారత ప్రభుత్వం ముమ్మరం చేసింది.
ఇప్పటివరకు 228 మంది భారతీయులతో బాటు 626 మందిని ఇక్కడికి తరలించినట్టు హర్ దీప్ పురి తెలిపారు. వీరిలో 77 మంది ఆఫ్ఘన్ సిక్కులు ఉన్నారని ఆయన చెప్పారు. కాబూల్ లోని భారత ఎంబసీ సిబ్బందిని ఇంతకుముందే ఇక్కడికి రప్పించినట్టు ఆయన పేర్కొన్నారు. ఆఫ్ఘానిస్తాన్ నుంచి వచ్చిన హిందువులు, సిక్కులకు సమాన ప్రయారిటీ ఇస్తామని ప్రభుత్వం ఇదివరకే తెలిపింది. ‘ఆపరేషన్ దేవీ శక్తి’ పేరిట ఇండియా ఈ నెల 16 నుంచి భారతీయుల తరలింపును ప్రారంభించింది. అంతకు ముందు రోజే కాబూల్ నగరాన్ని తాలిబన్లు ఆక్రమించుకున్నారు.
మరిన్ని ఇక్కడ చూడండి: తెలంగాణ ఎంసెట్ ఫలితాలు విడుదల…: TS EAMCET Result 2021 Live Video.
కన్నింగ్ లేడీ.. హనీట్రాప్ కేసులో కీలకం.. ముగ్గురి పేర్లతో ఒకే యువతి మోసం..:Honeytrap Case Video.
Kohli Drinking Water Video: కోహ్లీ తాగే నీళ్ల బాటిల్ ధర ఎంతో తెలుసా..?వామ్మో ఇంత ధరనా..?