ఐదుగురు ఎయిమ్స్ సిబ్బందికి కరోనా
కరోనా మహమ్మారి ఎవర్నీ వదలడం లేదు. గత కొద్ది రోజులుగా కరోనాను కట్టడి చేసి.. రోగులకు చికిత్స అందించే వైద్యులకే ఈ వైరస్ సోకుతుండటం కలకలం రేపుతోంది.

కరోనా మహమ్మారి ఎవర్నీ వదలడం లేదు. గత కొద్ది రోజులుగా కరోనాను కట్టడి చేసి.. రోగులకు చికిత్స అందించే వైద్యులకే ఈ వైరస్ సోకుతుండటం కలకలం రేపుతోంది. తాజాగా ఒడిషా భువనేశ్వర్‌లోని ఎయిమ్స్ ఆస్పత్రిలో కరోనా కలకలం రేపింది. ఆస్పత్రిలో పనిచేస్తున్న ఐదుగురు సిబ్బందికి కరోనా పాజిటివ్‌గా తేలింది. దీంతో వారిని ఆస్పత్రిలోని కరోనా వార్డుకు తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం వారి ఆరోగ్యం నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు. జూన్ 3వ తేదీన కరోనా పాజిటివ్ కేసు నమోదవ్వగా.. ఆ తర్వాత జూన్ 9వ తేదీన మరో నాలుగు కేసులు నమోదైనట్లు అధికారులు తెలిపారు. ఇప్పటి వరకు ఆస్పత్రిలో పనిచేసే 250 మంది సిబ్బందికి పైగా కరోనా పరీక్షలు నిర్వహించామని.. అందరికీ పరీక్షల్లో కరోనా నెగిటివ్ వచ్చిందని తెలిపారు.



