Telangana Corona Updates: తెలంగాణలో కరోనా వైరస్ వ్యాప్తి కొనసాగుతోంది. తాజాగా తెలంగాణలో 226 కొత్త కరోనా కేసులు నమోదు అయ్యాయి. ఇక 224 మంది కరోనాను జయించగా.. ఒకరు మృత్యువాత పడ్డారు. గడిచిన 24 గంటల్లో 31,647 శాంపిల్స్‌ను వైద్యులు పరీక్షించారు. వీరిలో 226 మందికి కరోనా సోకినట్లు నిర్ధారించారు. కాగా, తాజాగా నమోదైన కేసులతో కలుపుకుని ఇప్పటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా 2,92,621 మందికి కరోనా సోకింది. ఇక వీరిలో 2,87,117 మంది కరోనాను జయించి పూర్తి ఆరోగ్యవంతులు అయ్యారు. కాగా, కరోనా మహమ్మారి కారణంగా రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటి వరకు 1584 మంది మృత్యువాత పడ్డారు.
ప్రస్తుతం రాష్ట్రంలో 0.54 శాతం డెత్ రేట్ ఉండగా, రికవరీ రేట్ 98.11 శాతం ఉంది. ఇక ప్రస్తుతం రాష్ట్రంలో 3,920 యాక్టీవ్ కేసులు ఉన్నాయి. వీరిలో 2,322 మంది హోమ్ ఐసోలేషన్‌లో చికిత్స పొందుతున్నారు. మిగతా వారు ఆస్పత్రుల్లో వైద్యుల పర్యవేక్షణలో చికిత్స పొందుతున్నారు. ఇదిలాఉంటే.. తాజాగా నమోదై కరోనా కేసుల్లో అత్యధికంగా జీహెచ్ఎంసీలో 39 నమోదు అయ్యాయి. ఇక మేడ్చల్ మల్కాజిగిరి, కరీంనగర్, రంగారెడ్డి జిల్లా 16, 16, 15 చొప్పున కేసులు నమోదు అయ్యాయి.
Also read:
Rana Miheeka 3D Impressions : భల్లాలదేవుడి బహుమానం… అనుబంధాన్ని అచ్చువేయించాడు…
Corona Vaccination: తెలంగాణ వైద్య ఆరోగ్యశాఖ కీలక నిర్ణయం.. ఇకపై వారికి టీకా వేయరు..!