
రాజస్థాన్‌లో కరోనా వైరస్ విజృంభిస్తోంది. ఇప్పటికే రెండు వేల మార్క్ దాటిన కేసుల సంఖ్య.. మూడు వేల దిశగా వెళ్తోంది. తాజాగా గురువారం మరో 86 కొత్త కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 2,524కి చేరింది. ఈ విషయాన్ని రాజస్థాన్ రాష్ట్ర ఆరోగ్య శాఖ ఓ ప్రకటనలో తెలిపింది. ఇక వీరిలో ఇప్పటి వరకు 827 మంది కరోనా వైరస్ నుంచి బయటపడి డిశ్చార్జ్ అయ్యారని పేర్కొంది. తాజాగా కరోనా బారినపడి ఇద్దరు మరణించారు. దీంతో ఇంతవరకూ రాష్ట్రంలో కరోనా బారినపడి మరణించిన వారి సంఖ్య 57కు చేరుకుంది.
ఇక దేశవ్యాప్తంగా కరోనా కేసులు ఇప్పటికే 33వేలకు పైగా నమోదయ్యాయి. వీరిలో వెయ్యికి పైగా మరణించగా.. ఎనిమిది వేల మందికి పైగా కరోనాను జయించి ఆస్పత్రుల నుంచి డిశ్చార్జ్ అయ్యారు. ప్రస్తుతం 23వేలకు పైగా యాక్టివ్ కేసులు ఉన్నట్లు తెలుస్తోంది.