Coronavirus: పాఠశాలల్లో కరోనా భయం.. 192 మంది విద్యార్థులకు, 72 మంది సిబ్బందికి కోవిడ్ పాజిటివ్.. ఎక్కడంటే..?
COVID-19 Positive: దేశంలోని పలు ప్రాంతాల్లో పాఠశాలలు ప్రారంభమైనప్పటికీ.. అన్నిచోట్ల కరోనా భయం వెంటాడుతూనే ఉంది. తాజాగా కేరళలోని రెండు పాఠశాలల్లో..
COVID-19 Positive: దేశంలోని పలు ప్రాంతాల్లో పాఠశాలలు ప్రారంభమైనప్పటికీ.. అన్నిచోట్ల కరోనా భయం వెంటాడుతూనే ఉంది. తాజాగా కేరళలోని రెండు పాఠశాలల్లో ఉపాధ్యాయులకు, విద్యార్థులకు పరీక్షలు నిర్వహించగా 260 మందికి పైగా పాజిటివ్ రావడంపై ఆందోళన మొదలైంది. కేరళలో జనవరి ఒకటి నుంచి 10, 12 తరగతులను ప్రారంభించారు. కరోనా మార్గదర్శకాల అనుగుణంగా పాఠశాలల్లో క్లాసులు నిర్వహణ జరుగుతోంది. ఈ క్రమంలో బోర్డు పరీక్షలకు సిద్ధం చేసేందుకు తరగతులను, ప్రాక్టికల్స్ సైతం నిర్వహిస్తున్నారు. ఈ నేపధ్యంలో రెండు స్కూళ్లలో కోవిడ్-19 టెస్టులు నిర్వహించగా 192 మంది విద్యార్థులకు, 72 మంది పాఠశాల సిబ్బందికి కరోనా పాజిటివ్ నిర్ధారణ అయింది. దీంతో రాష్ట్రవ్యాప్తంగా ఆందోళన మొదలైంది.
మలప్పురంలోని మారన్‌చెరీ హయ్యర్ సెకండరీ పాఠశాలలో మొదట ఒక విద్యార్థికి కరోనా లక్షణాలు కనిపించడంతో ఆ విద్యార్థికి పరీక్ష నిర్వహించారు. పరీక్షా ఫలితం పాజిటివ్‌గా తేలడంతో ఆ పాఠశాలలోని విద్యార్థులకు, ఉపాధ్యాయులకు కరోనా టెస్టులు చేశారు. దీంతోపాటు మరో పాఠశాలలో కూడా ఉపాధ్యాయులకు, విద్యార్థులకు కరోనా పరీక్షలు చేశారు. ఈ రెండు పాఠశాలల్లో కలిపి మొత్తం 192 మంది విద్యార్థులకు, 72 మంది సిబ్బందికి కరోనా పాజిటివ్‌గా తేలింది. దీంతో అధికారులు అప్రమత్తమై అందరికీ చికిత్స అందిస్తున్నారు.
Also Read: