తెలంగాణ మహిళలకు హ్యాపీ న్యూస్.. వారికోసమే కీలక పథకాలు!
తెలంగాణ యువత, మహిళలకు హ్యాపీ న్యూస్ చెప్పింది ప్రభుత్వం. వారి కోసమే ప్రత్యేకంగా రెండు కీలక పథకాలను తీసుకురానుంది తెలంగాణ గవర్నమెంట్. త్వరలోనే టీఎస్ సర్కార్ ఈ రెండు పథకాలను ప్రవేశపెట్టబోతున్నట్లు..

తెలంగాణ యువత, మహిళలకు హ్యాపీ న్యూస్ చెప్పింది ప్రభుత్వం. వారి కోసమే ప్రత్యేకంగా రెండు కీలక పథకాలను తీసుకురానుంది తెలంగాణ గవర్నమెంట్. త్వరలోనే టీఎస్ సర్కార్ ఈ రెండు పథకాలను ప్రవేశపెట్టబోతున్నట్లు మంత్రి గంగుల కమలాకర్ హింట్ ఇచ్చారు. దీనికి సంబంధించిన వివరాలు త్వరలోనే వెల్లడిస్తామన్నారు. కాగా ఈ రెండు పథకాలను బీసీ సంక్షేమ శాఖ పరిధిలో అమలు చేయనున్నట్లు ఆయన పేర్కొన్నారు. అయితే ఈ రెండింటితో పాటు.. సీఎం కేసీఆర్ మరిన్ని పథకాలను కూడా ప్రకటించనున్నారని సమాచారం.
ఇక ఆ రెండు పథకాలేంటంటే.. ఎంబీసీ యువకుల కోసం కేసీఆర్ ఓ కొత్త పథకాన్ని తీసుకొచ్చారు. అదే ‘కేసీఆర్ ఆపద్బంధు’. ఈ పథకం ద్వారా అర్హులైన ఎంబీసీ విద్యార్థులకు ఒక్కటి చొప్పున అంబులెన్స్‌లను పంపిణీ చేయనున్నారు. అయితే ఈ ఆపద్బంధు పథకం ద్వారా రెండు ప్రయోజనాలు చేకూరుతాయి. ఒకటి నిరుద్యోగంతో పాటు మారుమూల ప్రాంతాలకు కూడా అంబులెన్స్ సేవలను విస్తరించడం జరుగుతుంది. మొదట జిల్లాకో అంబులెన్స్ చొప్పున పంపిణీ చేసి.. స్పందన చూసిన అనంతరం మరికొందరి నిరుద్యోగులను ఎంపిక చేస్తామన్నారు.
ఇక రెండోది.. ‘మహిళలకు కుట్టుమిషన్’ల పంపిణీ. దాదాపు 10 వేల మంది నిరుద్యోగ మహిళలను శిక్షణ ఇచ్చి కుట్టు మిషన్లు పంపిణీ చేయనున్నారు. ఇంటి వద్ద ఉండే ఆడువారికి ఆదాయం చేకూరేలా.. ఈ పథకాన్ని అమలు పరచనున్నారని తెలుస్తోంది. అలాగే చదువుకున్న నిరుద్యోగ యవతులకు నిఫ్ట్ ద్వారా శిక్షణ ఇచ్చి, ఉపాధి కల్పించనున్నట్లు మంత్రి గుంగుల కమలాకర్ తెలిపారు. సీఎం కేసీఆర్ స్వయంగా ఈ రెండు పథకాలను త్వరలో ఆయనే ప్రకటించనున్నట్లు సమాచారం.