Man Marries 2 Women: ఒకే అబ్బాయిని ప్రేమించి.. ఇష్టపడి మరీ ఒకేసారి పెళ్లి చేసుకున్న యువతులు.. ఎక్కడో తెలుసా..?

ప్రేమ పిచ్చిది.. ప్రేమలో పడ్డవారికి లోకంతో పనిలేదంటారు కొందరు. ఆ మాటలను నిజం చేస్తూ.. తాము ప్రేమించిన ఓ యువకుడిని వదులు కోమని.. ఇద్దరు అమ్మాయిలు ఒకే మండపంలో..

Man Marries 2 Women:  ఒకే అబ్బాయిని ప్రేమించి.. ఇష్టపడి మరీ ఒకేసారి పెళ్లి చేసుకున్న యువతులు.. ఎక్కడో తెలుసా..?
Follow us

|

Updated on: Jan 08, 2021 | 3:13 PM

Man Marries 2 Women: ప్రేమ పిచ్చిది.. ప్రేమలో పడ్డవారికి లోకంతో పనిలేదంటారు కొందరు. ఆ మాటలను నిజం చేస్తూ.. తాము ప్రేమించిన ఓ యువకుడిని వదులు కోమని.. ఇద్దరు అమ్మాయిలు ఒకే మండపంలో ఒకేసారి ఒకే వేదికపై పెళ్లి చేసుకున్నారు. ఇలాంటి సీన్స్ ఎక్కువుగా సినిమాల్లోనే చూస్తుంటాము.. కానీ ఛత్తీస్ గడ్ లో ఒకే వేదికపై ఇద్దరి అమ్మాయిను ఓ యువకుడు వివాహం చేసుకున్న వింతైన ఘటన చోటు చేసుకుంది.

ఈ నెల 5న ఛత్తీస్‌గఢ్‌లోని బస్తర్ జిల్లాలో జరిగిన ఈ పెళ్లి వేడుక సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఈ పెళ్లి దాదాపు 600 మంది బంధువులు హాజరయ్యారు. పెళ్ళిలో ఒక పెళ్ళికొడుకు, ఇద్దరు పెళ్లి కూతుర్లు.. మరి పెద్దలు ఏమని దీవించారో! అయితే ఇలా అమ్మాయిలు ఇద్దరూ ఆ అబ్బాయినే పెళ్లి చేసుకుంటామని పట్టుబట్టిమరీ వివాహం చేసుకున్నారు కనుక ఆ యువకుడు ఏ ధనవంతుడో.. సూపర్ మ్యాన్ అనుకునేరు.. ఆ యువకుడు అతి సామాన్య కుటుంబానికి చెందిన వ్యక్తి. మావోయిస్టు ప్రభావిత ప్రాంతమైన బస్తర్ జిల్లాలో ఓ మారుమూల గ్రామానికి చెందిన చందు మౌర్య వ్యవసాయ కూలీగా పనిచేస్తుంటాడు. మూడేళ్ల క్రితం అతడు సుందరి కశ్యప్ అనే యువతితో ప్రేమలో పడ్డాడు. రోజూ ఫోన్లో మాట్లాడుకోవడం ద్వారా మరింత దగ్గరైన వీరిద్దరూ పెళ్లిచేసుకోవాలని నిర్ణయించుకున్నారు. అయితే ఓ ఏడాది గడిచేలోపే వీరి ప్రేమ వ్యవహారం సినిమా రేంజ్ లో మరో మలుపు తిరిగింది.

చందు బంధువుల పెళ్ళికి వెళ్ళాడు.. అక్కడ హసీనా అనే యువతితో పరిచయమయ్యింది. తొలిచూపులోనే ఇష్టపడ్డాడు. హసీనాతో మాటలు కలిపాడు. హసీనా కూడా చందుని ఇష్టపడి మాటలు కలిపింది.. దీంతో ఇద్దరూ రోజూ ఫోన్లో మాట్లాడుకునే వారు. ఓ రోజు ఆ యువతి చందుని ప్రేమిస్తున్నాని చెప్పింది. అయితే చందు తాను అప్పటికే ఓ యువతిని ప్రేమించానని చెప్పినప్పటికీ.. హసీనా వినలేదు. చందుతోనే జీవితం అని చెప్పింది.

తమ ప్రేమ సుందరి తెలిసిన తర్వాత ఆమె అంగీకరించిందని చందు చెప్పాడు. హసీనా, సుందరి ఇద్దరూ నాతోనే జీవించేందుకు అంగీకరించారని తెలిపాడు. ఓ రోజు హసీనా తన ఇంటికి రావడంతో.. అది తెలుసుకుని సుందరి కూడా తన ఇంటికి వచ్చిందని అప్పటి నుంచి అందరం కలిసి ఒకే కుటుంబంలా జీవిస్తామని తెలిపాడు. అయితే ఇదే విషయంపై గ్రామస్థులు అభ్యంతరం తెలపడంతో.. ఇద్దరి యువకులను పెళ్లి చేసుకున్నానని చెప్పాడు ఇద్దరు అమ్మాయిల ముద్దుల మొగుడు.

Also Read:24 ఏళ్ల తర్వాత మైఖేల్ జాక్సన్ కచేరీ కి పన్ను మినహాయింపు ఇస్తామంటున్న..