06 April 2025

టిక్ టాక్ వీడియోలతో ఫేమస్.. చేసిన సినిమాలన్నీ అట్టర్ ప్లాప్.. ఇప్పుడు

Rajitha Chanti

Pic credit - Instagram

ఎలాంటి ఫిల్మ్ బ్యాగ్రౌండ్ లేని అమ్మాయి నటనపై ఆసక్తితో మోడలింగ్ రంగంలోకి అడుగుపెట్టింది. సొంతంగా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసింది.

యూట్యూబర్‏గా మొదలైన ఆమె ప్రయాణం.. ఆ తర్వాత టిక్ టాక్ వీడియోస్‏తో ఫేమస్ అయ్యేలా చేసింది. దీంతో హీరోయిన్‎గా ఛాన్స్ కొట్టేసింది.

తెలుగులో హీరోయిన్‏గా ఫస్ట్ మూవీతోనే అందరి దృష్టిని తనవైపుకు తిప్పుకుంది. కానీ ఈ అమ్మడు నటించిన చిత్రాలన్ని డిజాస్టర్స్ అయ్యాయి. 

ఆమె మరెవరో కాదండి.. హీరోయిన్ కేతిక శర్మ. పూరి జగన్నాథ్ తెరకెక్కించిన రొమాంటిక్ సినిమాతో తెలుగు తెరకు కథానాయికగా పరిచయమైంది. 

కానీ ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద ప్లాప్ కాగా.. తెలుగులో కేతికకు మాత్రం వరుస ఆఫర్స్ క్యూ కట్టాయి. కానీ ఇప్పటివరకు సరైన హిట్టు అందుకోలేకపోయింది. 

 ఇటీవలే నితిన్, శ్రీలీల కలిసి నటించిన రాబిన్ హుడ్ చిత్రంలో అదిదా సర్ ప్రైజ్ అంటూ స్పెషల్ సాంగ్‏తో ఒక్కసారిగా సెన్సేషన్ క్రేజ్ సొంతం చేసుకుంది. 

కానీ ఈ పాటలోని కొన్ని స్టెప్స్ పట్ల విమర్శలు రావడంతో ఇటు కేతికపై సైతం ఫ్యాన్స్ ఫైర్ అయ్యారు. ఇప్పుడు ఈ అమ్మడు సరైన ఆఫర్స్ కోసం వెయిట్ చేస్తుంది. 

ప్రస్తుతం సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటున్న కేతిక.. నిత్యం క్రేజీగా గ్లామర్ ఫోటోస్, ట్రెడిషనల్ ఫోటోస్ షేర్ చేస్తూ నెటిజన్లను ఆకట్టుకుంటుంది.