
బ్యాంకాక్‌లో తాజాగా మలయాళీ కౌన్సిల్ (WMC) జరిగింది. ఈ సదస్సులో ప్రపంచ వ్యాప్తంగా విదేశాల్లో నర్సింగ్ చదువుతున్న మహిళా విద్యార్థులకు ఆర్ధిక చేయూత అందించేందుకు ఏకంగా రూ. కోటి విలువైన స్కాలర్‌షిప్‌లను అందించనున్నట్లు WMC ప్రకటించింది. ఈ మేరకు బ్యాంకాక్‌లో జరిగిన 14వ ద్వైవార్షిక సమావేశంలో WMC అధ్యక్షుడు డాక్టర్ బాబు స్టీఫెన్ ప్రకటించారు. కేరళకు చెందిన నర్సింగ్ విద్యార్థుల కోసం రూ. కోటి స్కాలర్‌షిప్ కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నట్లు వెల్లడించారు. కేరళలోని 14 జిల్లాల నుంచి ఎంపిక చేసిన 100 మంది విద్యార్థులకు మొదటి రౌండ్‌లో ఈ స్కాలర్‌షిప్‌లను అందించనున్నట్లు తెలిపారు. ఇందుకు సంబంధించిన వివరణాత్మక వివరాలు అంటే దరఖాస్తు విధానాలు, అర్హత ప్రమాణాలను త్వరలో ప్రకటిస్తామని ఆయన తెలిపారు.
వరల్డ్ మలయాళీ కౌన్సిల్ ప్రపంచవ్యాప్తంగా మలయాళీలను అనుసంధానించడానికి, సాంస్కృతిక పరిరక్షణను ప్రోత్సహించడానికి, అభివృద్ధి కార్యకలాపాలను ప్రోత్సహించడానికి అంకితమైన ప్రపంచ సంస్థగా గ్లోబల్ సెక్రటరీ జనరల్ దినేష్ నాయర్ తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా 65 కంటే ఎక్కువ మందితో WMC మలయాళీలు నెట్‌వర్క్ చేయడానికి, సాంస్కృతిక కార్యక్రమాలలో పాల్గొనడానికి, సామాజిక సేవలో పాల్గొనడానికి ఇదొక వేదికగా అవతరించిందని అన్నారు. బ్యాంకాక్‌లో జరిగిన ఈ WMC గ్లోబల్ కాన్ఫరెన్స్‌లో US, కెనడా, మిడిల్ ఈస్ట్, ఆస్ట్రేలియా, భారత్ సహా బహుళ దేశాలకు ప్రాతినిధ్యం వహిస్తున్న 565 మందికి పైగా ప్రతినిధులు పాల్గొన్నారు.
ఎంపీ జాన్ బ్రిట్టాస్, మాజీ ఎంపీ కే మురళీధరన్, ఎమ్మెల్యే సనీష్ కుమార్, సోనా నాయర్, మురుగన్ కట్టక్కడ ప్రముఖులు ఈ కాన్ఫరెన్పారెన్స్‌కు హాజరయ్యారు. ఈ సదస్సు మలయాళీ సంస్కృతి, ఐక్యతను ప్రపంచవ్యాప్తంగా ప్రచారం చేసేందుకు దోహదపడింది. WMCకి అధ్యక్షులుగా డా. బాబు స్టీఫెన్ , థామస్ మొట్టకల్ బాధ్యతలు స్వీకరించారు. సెక్రటరీ జనరల్‌గా షాజీ మాథ్యూ, ట్రెజరర్ (కోశాధికారి)గా సన్నీ వెలియాత్ నియామకమయ్యారు.
మరిన్ని విద్యా, ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి.