WBPHED Recruitment 2021: ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న యువతకు ఓ సువర్ణావకాశం. పబ్లిక్ హెల్త్ ఇంజినీరింగ్ డిపార్ట్‌మెంట్ (WBPHED) ఇంజనీర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. అర్హత, ఆసక్తి ఉన్న అభ్యర్థులందరూ డిసెంబర్ 10లోపు అప్లై చేసుకోవచ్చు. ఇందుకోసం అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్ wbphed.gov.in ని సందర్శించాలి.
అర్హతలు
ఈ పోస్టులకు దరఖాస్తు చేయడానికి అభ్యర్థులు ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి సంబంధిత సబ్జెక్ట్‌లో గ్రాడ్యుయేట్ డిగ్రీ/డిప్లొమా కలిగి ఉండాలి. విద్యార్హతకు సంబంధించిన మరింత సమాచారం కోసం అభ్యర్థులు నోటిఫికేషన్‌ను చదవండి. ఈ రిక్రూట్‌మెంట్ ప్రక్రియ ద్వారా మొత్తం 50 పోస్టులను భర్తీ చేస్తారు. అభ్యర్థులు దరఖాస్తు చేసుకునే ముందు విడుదల చేసిన నోటిఫికేషన్‌ను చదవాలని సూచించారు. ఎందుకంటే అనర్హుల దరఖాస్తులు అంగీకరించరు.
వయో పరిమితి
ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థుల వయస్సు 40 ఏళ్లలోపు ఉండాలి. అభ్యర్థులకు రూ.28,000/- జీతం చెల్లిస్తారు. ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. దరఖాస్తుల ఆధారంగా షార్ట్‌లిస్ట్ చేయబడిన అభ్యర్థులను వాక్-ఇన్-ఇంటర్వ్యూకి పిలుస్తారు. ఈ సమాచారం ఈ-మెయిల్ ఐడి ద్వారా తెలియజేస్తారు.
మొత్తం 50 పోస్టులను భర్తీ చేస్తున్నారు. సివిల్, ఎలక్ట్రికల్ ఇంజనీర్ పోస్టులు ఉన్నాయి.
అసిస్టెంట్ ఇంజనీర్ (సివిల్) – 30
అసిస్టెంట్ ఇంజనీర్ (ఎలక్ట్రికల్) – 20