
WAPCOS Recruitment 2021: వాటర్ అండ్ పవర్ కన్సల్టెన్సీ సర్వీసెస్ లిమిటెడ్ పలు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసింది. భారత ప్రభుత్వ మంత్రిత్వశాఖకు చెందిన ఈ సంస్థ తాత్కాలిక ఒప్పంద ప్రాతిపదిక ఇంజనీర్ (సివిల్) పోస్టుల భర్తీ చేపట్టనున్నారు. దరఖాస్తు స్వీకరణకు రేపటితో (23-06-2021) గడువు ముగియనుంది. ఈ నేపథ్యంలో నోటిఫికేషన్‌కు సంబంధించిన పూర్తి వివరాలపై ఓ లుక్కేయండి..
* నోటిఫికేషన్‌లో భాగంగా మొత్తం 12 ఖాళీలను భర్తీ చేయనున్నారు.
* ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు.. సివిల్ ఇంజనీరింగ్‌లో డిప్లొమా/బీటెక్ ఉత్తీర్ణులవ్వాలి.
* బీటెక్ అభ్యర్థులు కనీసం రెండేళ్లు, డిప్లొమా అభ్యర్థులు కనీసం ఐదేళ్ల అనుభవం కలిగి ఉండాలి.
* ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఎగ్జిక్యూషన్/రోడ్/ఎస్‌టీపీ/డబ్ల్యూటీపీ ప్రాజెక్ట్‌ల వారికి ప్రాధాన్యం ఉంటుంది.
* పైన పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థుల వయసు 01.06.2021 నాటికి 32ఏళ్లు మించకూడదు.
* అభ్యర్థులను స్కిల్ టెస్ట్/ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు.
* అభ్యర్థులు ముందుగా ఆన్‌లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాలి.
* అనంతరం హార్డ్ కాపీని డా.ఎస్.కె. త్యాగి, ప్రాజెక్ట్ డైరెక్టర్, వ్యాపకోస్ లిమిటెడ్, సెంటర్ ఫర్ వాటర్ సప్లై అండ్ శానిటేషన్, ఎస్‌సీఓ–302,ఫస్ట్ అండ్ సెకండ్ ఫ్లోర్,సెక్టర్–09,పంచకుల,హర్యానా –134112 చిరునామాకు పంపించాలి.
* దరఖాస్తుల స్వీకరణకు చివరి తేదీగా 23-06-2021ని నిర్ణయించారు.
* పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
Also Read: Indian Navy Admit Card: అడ్మిట్ కార్డులు విడుదల చేసిన ఇండియన్ నేవీ.. ఇలా డౌన్‌లోడ్ చేసుకోండి..
AP DSC: ‘2008 డీఎస్సీ’లకు కాంట్రాక్ట్ కొలువు.. ఆంధ్రప్రదేశ్ పాఠశాల విద్యాశాఖ ఉత్తర్వులు జారీ..