Indian Navy Admit Card: అడ్మిట్ కార్డులు విడుద‌ల చేసిన ఇండియ‌న్ నేవీ.. ఇలా డౌన్‌లోడ్ చేసుకోండి..

Indian Navy Admit Card 2021: ఇండియ‌న్ నేవీ 2021 సంవత్సరానికి సంబంధించి పలు పోస్టులను భర్తీ చేసేందుకు నోటిఫికేషన్‌ను విడుదల చేసిన విష‌యం తెలిసిందే. ఇందుకు స్పోర్ట్స్ కోటా ద్వారా అర్హులైన...

Indian Navy Admit Card: అడ్మిట్ కార్డులు విడుద‌ల చేసిన ఇండియ‌న్ నేవీ.. ఇలా డౌన్‌లోడ్ చేసుకోండి..
Indian Navy Admit Cards
Follow us
Narender Vaitla

|

Updated on: Jun 22, 2021 | 3:29 PM

Indian Navy Admit Card 2021: ఇండియ‌న్ నేవీ 2021 సంవత్సరానికి సంబంధించి పలు పోస్టులను భర్తీ చేసేందుకు నోటిఫికేషన్‌ను విడుదల చేసిన విష‌యం తెలిసిందే. ఇందుకు స్పోర్ట్స్ కోటా ద్వారా అర్హులైన అవివాహిత పురుష అభ్యర్థుల నుంచి దరఖాస్తులను కోరింది. పలు విభాగాల్లో 10, ఇంటర్ అర్హతతో స్పోర్ట్స్ కోటాలో పోస్టులను భర్తీ చేయనున్నారు. ఈ పోస్టులకు అర్హత కలిగిన అభ్యర్థులు ఆఫ్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి. ద‌ర‌ఖాస్తుల స్వీక‌ర‌ణ మార్చి 7తో ముగిసింది. ఈ నేప‌థ్యంలోనే అడ్మిట్ కార్డుల‌ను విడుద‌ల చేసింది. ప‌రీక్ష‌కు హాజ‌ర‌య్యే అభ్య‌ర్థులు అడ్మిట్ కార్డును డౌన్‌లోడ్ చేసుకోవాల‌ని సూచించారు. ఈ నోటిఫికేషన్‌ ద్వారా సెయిల‌ర్ విభాగంలో సీనియ‌ర్ సెకండ‌రీ రిక్రూట్‌ (ఎస్ఎస్ఆర్‌), ఆర్టిఫిస‌ర్ అప్రెంటిస్ (ఏఏ) పోస్టుల‌ను భ‌ర్తీ చేయ‌నున్నారు. ఈ పోస్టులకు ఎంపికైన వారికి ట్రైనింగ్‌ స‌మ‌యంలో ప్ర‌తినెల‌ రూ.14,600 స్టయిఫండ్‌ ఇస్తారు. మొత్తం 2500 ఖాళీల‌ను భ‌ర్తీ చేయ‌నుండ‌గా.. వీటిలో 500 సెయిల‌ర్ (ఏఏ), 2000 ఎస్ఎస్ఆర్ ఖాళీల‌ను రిక్రూట్ చేయ‌నున్నారు.

అడ్మిట్ కార్డును ఇలా డౌన్‌లోడ్ చేసుకోవాలి..

* అభ్య‌ర్థులు ముందుగా ఇండియ‌న్ నేవీ అధికారిక వెబ్‌సైట్ joinindiannavy.gov.inలోకి వెళ్లాలి. * అనంత‌రం క్యాండిడేట్ లాగిన్ అనే ట్యాబ్‌పై క్లిక్ చేయాలి. * త‌ర్వాత మీ లాగిన్ వివ‌రాల‌ను ఎంట‌ర్ చేసి స‌బ్‌మిట్ బ‌ట‌న్‌ను క్లిక్ చేయాలి. * వెంట‌నే మీ అడ్మిట్ కార్డు క‌నిపిస్తుంది. అనంత‌రం భ‌విష్య‌త్తు అవ‌స‌రాల కోసం ఆ అడ్మిట్ కార్డును డౌన్‌లోడ్ చేసుకోవాలి. * రాత ప‌రీక్షకు హాజ‌రైన అభ్య‌ర్థుల ఫ‌లితాల‌ను జూలై 2 నుంచి ఇండియ‌న్ నేవీ అధికారిక వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచుతారు.

Also Read: Indian Army Recruitment: ఇండియన్ ఆర్మీలో ఉద్యోగాలు.. నెల జీతం రూ. 56,100 పైగానే.. అప్లికేషన్ ఎలాగంటే..

AP DSC: ‘2008 డీఎస్సీ’లకు కాంట్రాక్ట్‌ కొలువు.. ఆంధ్రప్రదేశ్ పాఠశాల విద్యాశాఖ ఉత్తర్వులు జారీ..

AP Intermediate Board: ఏపీ సర్కార్ కీలక నిర్ణయం.. జూనియర్‌ కాలేజీల ప్రొవిజినల్‌ అఫిలియేషన్‌ దరఖాస్తు గడువు పొడిగింపు..

మూడు పూటలా అన్నమే తింటున్నారా..? ఇంతకీ అది మంచిదేనా.?
మూడు పూటలా అన్నమే తింటున్నారా..? ఇంతకీ అది మంచిదేనా.?
లాంటి కోనేరు.. ప్రపంచంలో ఇంకెక్కడైనా ఉంటుందా.? మహానంది క్షేత్రంలో
లాంటి కోనేరు.. ప్రపంచంలో ఇంకెక్కడైనా ఉంటుందా.? మహానంది క్షేత్రంలో
భీమేశ్వర ఆలయంలో అఘోరీ ప్రత్యక్షం.! వస్త్రాలు లేకుండా దర్శనానికి..
భీమేశ్వర ఆలయంలో అఘోరీ ప్రత్యక్షం.! వస్త్రాలు లేకుండా దర్శనానికి..
సాయి దుర్గా తేజ్ కు పవన్ కళ్యాణ్ సన్మానం.! ఎందుకు అనుకుంటున్నారా?
సాయి దుర్గా తేజ్ కు పవన్ కళ్యాణ్ సన్మానం.! ఎందుకు అనుకుంటున్నారా?
పుష్పరాజ్ కోసం రంగంలోకి జక్కన్న.! ఇది కూడా సుకుమార్ ప్లానేనా.?
పుష్పరాజ్ కోసం రంగంలోకి జక్కన్న.! ఇది కూడా సుకుమార్ ప్లానేనా.?
గొప్ప మనసు చాటుకున్న గ్లామర్ హీరోయిన్.! అనన్య వీడియో వైరల్..
గొప్ప మనసు చాటుకున్న గ్లామర్ హీరోయిన్.! అనన్య వీడియో వైరల్..
తనపై.. ఆలియాపై వస్తున్న వార్తలపై స్పందించిన నాగ్ అశ్విన్.!
తనపై.. ఆలియాపై వస్తున్న వార్తలపై స్పందించిన నాగ్ అశ్విన్.!
హీరోయిన్‌కు బాధ.. ఫ్యాన్స్‌కు సంతోషం.! రష్మిక పోస్ట్‌కు మిక్స్‌డ్
హీరోయిన్‌కు బాధ.. ఫ్యాన్స్‌కు సంతోషం.! రష్మిక పోస్ట్‌కు మిక్స్‌డ్
రేసింగ్ కార్, లగ్జరీ విల్లా, కిలోల్లో బంగారం. నాగచైతన్యకు కానుకలు
రేసింగ్ కార్, లగ్జరీ విల్లా, కిలోల్లో బంగారం. నాగచైతన్యకు కానుకలు
ఏపీ మందుబాబులకు మరో గుడ్‌న్యూస్.. ఇది కదా కావాల్సింది
ఏపీ మందుబాబులకు మరో గుడ్‌న్యూస్.. ఇది కదా కావాల్సింది