Varun Moters: శ్రీకాకుళం వరుణ్‌ మోటార్స్‌లో ఉద్యోగాలు.. ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక. ఎలా దరఖాస్తు చేసుకోవాలంటే.

|

Jul 11, 2021 | 9:25 PM

Varun Moters: ఆంధ్రప్రదేశ్‌లోని వరుణ్‌ మోటార్స్‌ భారీ ఎత్తున ఉద్యోగులను తీసుకోనుంది. ఇందుకు సంబంధించిన నోటిఫికేషన్‌ను విడుదల చేశారు. ఇక ఆంధ్రప్రదేశ్‌ స్టేట్‌ స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ ఈ నోటిఫికేషన్‌కు సంబంధించిన...

Varun Moters: శ్రీకాకుళం వరుణ్‌ మోటార్స్‌లో ఉద్యోగాలు.. ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక. ఎలా దరఖాస్తు చేసుకోవాలంటే.
Varun Motors Recruitment
Follow us on

Varun Moters: ఆంధ్రప్రదేశ్‌లోని వరుణ్‌ మోటార్స్‌ భారీ ఎత్తున ఉద్యోగులను తీసుకోనుంది. ఇందుకు సంబంధించిన నోటిఫికేషన్‌ను విడుదల చేశారు. ఇక ఆంధ్రప్రదేశ్‌ స్టేట్‌ స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ ఈ నోటిఫికేషన్‌కు సంబంధించిన వివరాలను ట్విట్టర్‌ ద్వారా షేర్‌ చేసింది. రిజిస్ట్రేషన్‌ గడువు 14-07-2021తో ముగియనున్న నేపథ్యంలో ఏయో పోస్టులను భర్తీ చేస్తున్నారు.? అర్హతలు ఏంటి అన్న వివరాలు ఓసారి చూద్దాం..

భర్తీ చేయనున్న ఖాళీలు, అర్హతలు..

* సేల్స్‌ ఎగ్జిక్యూటివ్‌ (ఎరేనా) – (25) ఖాళీలను భర్తీ చేస్తున్నారు. ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు ఏదైనా డిగ్రీ చేసి ఉండాలి. కచ్చితంగా టూ వీలర్‌ డ్రైవింగ్ లైసెన్స్‌తో పాటు తెలుగు, ఇంగ్లిష్‌లో మాట్లాడగలగాలి.
* రిలేషన్‌షిప్‌ మేనేజర్స్‌ (నెక్సా) – (25) ఖాళీలను భర్తీ చేయనున్నారు. ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే వారు ఏదైనా డిగ్రీ పూర్తిచేయడంతోపాటు 2 వీలర్‌ డ్రైవింగ్‌ లైసెన్స్‌తో పాటు తెలుగు, ఇంగ్లిష్‌లో మాట్లాడగలగాలి.
* ఎవల్యుయేటర్స్‌ (ట్రూ వాల్యూ) – (05) ఖాళీలను భర్తీ చేయనున్నారు. ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే వారు ఐటీఐ, డిప్లొమా మెకానికల్‌ పూర్తి చేసి ఉండాలి. అలాగే 2, 4 వీలర్స్‌ డ్రైవింగ్ లైసెన్స్‌ ఉండాలి.
* డ్రైవింగ్‌ ఇన్‌స్ట్రక్టర్స్‌ (05) పోస్టులకు దరఖాస్తు చేసుకునే వారు ఐటీఐ, డిప్లొమా పూర్తి చేసి ఉండాలి. ఇక 2, 4 వీలర్‌ తప్పనిసరి.
* పెయింటర్స్‌ (15) పోస్టులకు అప్లై చేసుకునే వారు ఐటీఐ (ఫిట్టర్‌ అండ్‌ షీట్‌ మెటల్‌) పూర్తి చేసి ఉండాలి.
* డెంటర్స్‌ (18) పోస్టులకు దరఖాస్తు చేసుకునే వారు ఐటీఐ (షీట్‌ మెటల్‌ అండ్‌ వెల్డర్‌) పూర్తి చేసి ఉండాలి.
* టెక్నీషియన్స్‌ (18) పోస్టులకు అప్లై చేసుకునే వారు (డీజిల్‌ మెక్‌ అండ్‌ మోటర్‌ మెకానిక్‌) అండ్‌ డిప్లొమా (ఆటో మొబైల్‌ అండ్‌ మెకానికల్‌) పూర్తి చేసి ఉండాలి.
* ఎలక్ట్రానిక్స్‌ (15) పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు ఐటీఐ ఎలక్ట్రిషియన్‌ / డిప్లొమా ఎలక్ట్రికల్‌ విద్యార్హత ఉండాలి.

ముఖ్యమైన విషయాలు..

* ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థులు https://apssdc.in/industryplacements వెబ్‌సైట్‌లోకి వెళ్లి రిజిస్ట్రేషన్‌ చేసుకోవాల్సి ఉంటుంది.
* రిజిస్ట్రేషన్‌లకు చివరి తేదీగా 14-07-2021ని నిర్ణయించారు.
* ఇంటర్వ్యూను 17-07-2021న నిర్ణయిస్తారు.
* రిజిస్ట్రేషన్‌ చేసుకున్న వారు శ్రీకాళుం, పెద్ద పల్లి వరుణ్‌ మోటార్స్‌లో నిర్వహించే ఇంటర్వ్యూకు హాజరు కావాలి.
* అభ్యర్థులను 3 రౌండ్‌ల ఇంటర్వ్యూలను నిర్వహించి ఎంపిక చేస్తారు.
* ఎంపికైన అభ్యర్థులకు ఒక నెలపాటు శిక్షణ ఇస్తారు.
* అభ్యర్థులు శ్రీకాకుళం, రణస్థలం, టెక్కాలి, పాలకొండ, పాల్సా, సోమ్‌పేట, రాజన్‌ లొకేషన్‌లో పని చేయాల్సి ఉంటుంది.
* పూర్తి వివరాలకు శేఖర్‌ (8374000973), వెంకటేష్‌ (7569077449) నెంబర్లను సంప్రదించండి.

Also Read: 85 Year Old Grandma: ఈ 85 ఏళ్ల బామ్మగారికి ఫన్నీగా ప్రేమించడానికి 36 ఏళ్ల యువకుడు కావాలట ..

THSTI Recruitment: ట్రాన్స్‌లేషనల్‌ హెల్త్‌ సైన్స్‌ అండ్‌ టెక్నాలజీలో ఉద్యోగాలు.. దరఖాస్తులకు చివరి తేదీ..

SBI Apprentice: స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియాలో భారీగా అప్రెంటిస్‌ పోస్టులు.. అర్హులెవరు, ఎలా దరఖాస్తు చేసుకోవాలంటే.