UCIL Recruitment: యురేనియం కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిటిటెడ్ (యూసీఐఎల్) పలు ట్రేడ్‌లలో అప్రెంటిస్‌ల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసింది. ప్రభుత్వ రంగ సంస్థ అయిన యూసీఐఎల్‌లో మొత్తం 242 అప్రెంటిస్‌ల పోస్టులను తీసుకోనున్నారు. నోటిఫికేషన్‌కు సంబంధించిన పూర్తి వివరాలపై ఓ లుక్కేయండి..
* మొత్తం 242 అప్రెంటిస్‌లో ఫిట్టర్, ఎలక్ట్రిషియన్, వెల్డర్, టర్నర్ వంటి ట్రేడ్‌లు ఉన్నాయి.
* వీటిలో ఫిట్టర్ (20), ఎలక్ట్రిషియన్ (80), వెల్డర్ (40), టర్నర్ లేదా మెషినిస్ట్ (15), ఇన్‌స్ట్రుమెంట్ మెకానిక్ (5), మెకానిక్ డీజిల్ లేదా మోటార్ వెహికిల్ (12), కార్పెంటర్ (05), ప్లంబర్ (05) పోస్టులు ఉన్నాయి.
* పైన తెలిపిన పోస్టులకు దరఖాస్తు చేసుకునే వారు పదో తరగతి పాసై, ఐటీఐ పూర్తి చేసి ఉండాలి.
* అభ్యర్థుల వయసు 18 నుంచి 25 ఏళ్ల మధ్య ఉండాలి.
* ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థులు ఆన్‌లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
* అభ్యర్థులను ఐటీఐలో వచ్చిన మార్కుల ఆధారంగా ఎంపిక చేస్తారు.
* దరఖాస్తుల స్వీకరణ అక్టోబర్ 29తో ముగియనుంది.
* పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
Also Read: CRPF: రైల్వే స్టేషన్‌లో భారీ పేలుడు.. ఆరుగురు జవాన్లకు తీవ్ర గాయాలు.. రైలులో..
Samsung Galaxy A13: శాంసంగ్ గెలాక్సీ A13 సూపర్ ఫీచర్లు లీక్, ధర ఎంతంటే? వీడియో