UPSC Toppers: ఒక వ్యక్తి ఎలా టాపర్‌ అవుతాడు.. వారికి ఉండే 5 ప్రత్యేకతలు తెలుసుకోండి..!

|

May 30, 2022 | 8:12 PM

UPSC Toppers: పాఠశాలలో అందరు కలిసే చదువుకుంటారు. కానీ ఒకరు IIT JEEలో ర్యాంక్ హోల్డర్ అయితే మరొకరు UPSC పరీక్ష క్లియర్ చేస్తాడు. కానీ చాలామందిలో మెదిలే ప్రశ్న ఏంటంటే వారిలా నేను ఎందుకు కాలేకపోతున్నాను..?

UPSC Toppers: ఒక వ్యక్తి ఎలా టాపర్‌ అవుతాడు.. వారికి ఉండే 5  ప్రత్యేకతలు తెలుసుకోండి..!
Toppers
Follow us on

UPSC Toppers: పాఠశాలలో అందరు కలిసే చదువుకుంటారు. కానీ ఒకరు IIT JEEలో ర్యాంక్ హోల్డర్ అయితే మరొకరు UPSC పరీక్ష క్లియర్ చేస్తాడు. కానీ చాలామందిలో మెదిలే ప్రశ్న ఏంటంటే వారిలా నేను ఎందుకు కాలేకపోతున్నాను..? దీనికి సమాధానం ఏంటంటే వివిధ రకాల వ్యక్తులు వివిధ రకాలుగా చదువుతారు. అందరికి ఒకటే ఫార్ములా ఉండాలని లేదు. టాపర్ విద్యార్థులు వారి ప్రత్యేక అధ్యయన వ్యూహం వల్ల మాత్రమే పరీక్షల్లో ర్యాంక్ పొందుతారు. చాలా మంది ర్యాంక్ హోల్డర్లు విభిన్న విజయగాథలు చెబుతారు. అయితే కొంత మంది విద్యార్థులు కష్టపడి చదివినా విజయం సాధించలేకపోతారు. ఇలా ఎందుకు జరుగుతుందో తెలుసుకుందాం.

టాపర్స్ 5 లక్షణాలు

1. స్వీయ క్రమశిక్షణ: టాపర్‌ విద్యార్థులు స్వీయ-క్రమశిక్షణను పాటిస్తారు. చివరి నిమిషం వరకు వేచి ఉండరు. ఒక అసైన్‌మెంట్‌ను పూర్తి చేయాలని అనుకుంటే వెంటనే చేసేస్తారు. దానిని వాయిదా వేయరు. అందుకే వారు అన్నిటిలో విజయం సాధిస్తారు.

ఇవి కూడా చదవండి

2. ఆత్మవిశ్వాసంతో చదవడం: టాపర్‌ విద్యార్థులు అత్మవిశ్వాసంతో ఉంటారు. ఒక ప్రత్యేకమైన ప్లాన్‌ ఎంచుకుంటారు. ఎప్పుడు ఏం చేయాలో వారికి కచ్చితంగా తెలుసు. వారు అసైన్‌మెంట్, పరీక్షల గురించి ఎప్పుడూ ఆలోచించరు. చదవడం మాత్రమే చేస్తారు.

3. చురుకుగా ఉంటారు: అగ్రశ్రేణి విద్యార్థులు చాలా చురుకుగా ఉంటారు. కొంతమంది విద్యార్తులు ఏదైనా పుస్తకాన్ని చదవడానికి గంటలు గంటలు గడుపుతారు. కానీ వీరు అలా కాదు వెంటనే అందులో ఉన్న విషయాన్ని ఆకలింపు చేసుకుంటారు. అందుకే పరీక్షల్లో మంచి స్కోరు చేస్తారు. టాపర్‌ విద్యార్థులు ఏదైనా టాపిక్‌ని బాగా అర్థం చేసుకోగలరు.

4. రివైజ్‌ చేయడం: టాపర్ విద్యార్థులు ఏదైనా విషయాన్ని రివైజ్‌ చేసుకుంటు మరిచిపోలేని విధంగా చదువుతారు. ఎన్ని గంటలు చదివాం అన్నది ముఖ్యం కాదు. అందులో ఎంత నేర్చుకున్నాం అనే రీతిలో చదువుతారు.

5. అదనపు స్టడీ మెటీరియల్: టాపర్ విద్యార్థులు అదనపు స్టడీ మెటీరియల్‌ని కూడా ఉపయోగిస్తారు. వారు ఒక అంశాన్ని సరిగ్గా అర్థం చేసుకోకపోతే దానిని ఇతర మూలాల నుంచి అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తారు. అప్పటికీ విషయం అర్థం కాకపోతే దాని గురించి తెలిసిన ఉపాధ్యాయులు కానీ స్నేహితులని కానీ అడిగి తెలుసుకుంటారు.

మరిన్ని నాలెడ్జ్‌ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి