UPSC Notification 2022: ఉద్యోగాల భర్తీకి సంబంధించి యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్‌లో భాగంగా 18 పోస్టులను భర్తీ చేయనున్నట్లు యూపీఎస్సీ తెలిపింది. దరఖాస్తు ప్రక్రియ ఇప్పటికే ప్రారంభమవగా.. చివరి తేదీ ఫిబ్రవరి 10గా నిర్ణయించారు. దరఖాస్తు ప్రక్రియ అంతా ఆన్‌లైన్ ద్వారానే ఉంటుందని యూపీఎస్సీ స్పస్టం చేసింది. అర్హత, ఆసక్తి గల అభ్యర్థులు యూపీఎస్సీ అధికారిక వెబ్ సైట్ upsc.gov.in ని సందర్శించడం ద్వారా ఆన్ లైన్ అప్లికేషన్ చేసుకోవాలని సూచించారు అధికారులు.
నోటిఫికేషన్ వివరాలు..
ఈ నోటిఫికేషన్‌లో సీనియర్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్స్, అసిస్టెంట్ ఎంప్లాయ్మెంట్ ఆఫీసర్ పోస్టులను భర్తీ చేయనున్నారు.
మొత్తం పోస్టులు 14 కాగా, వాటిలో సీనియర్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ – 8, అసిస్టెంట్ ఎంప్లాయ్మెంట్ ఆఫీసర్ – 1, సబ్ రీజనల్ ఎంప్లాయ్మెంట్ ఆఫీసర్ – 1, అసిస్టెంట్ ప్రొఫెసర్ (ఆయుర్వేద) – 4 పోస్టులు ఉన్నాయి. పూర్తి వివరాల కోసం యూపీఎస్సీ అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించవచ్చు.
Also read:
Harish Shankar : ‘అబ్బా చింపేశావ్ అన్నయ్యా.. నిజానికి పిండేశావ్’.. హరీష్ శంకర్ ఆసక్తికర ట్వీట్
Priyamani: సెకండ్ ఇన్నింగ్ లో వరుస అవకాశాలతో దూసుకుపోతున్న ‘ప్రియమణి’ ఆకట్టుకుంటున్న ఫొటోస్…
Telangana: అక్కడ జీలుగు కల్లుకు యమ డిమాండ్.. ఏకంగా సీసా రూ.500.. ముందు బుక్ చేసుకుంటేనే