UPSC IES/ISS admit card 2022 Download: యూపీఎస్సీ నిర్వహించే ఇండియన్ ఎకనామిక్ సర్వీస్/ఇండియన్ స్టాటిస్టికల్ సర్వీస్ (IES/ISS) పరీక్షలకు 2022 సంబంధించిన అడ్మిట్ కార్డులను యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (UPSC) విడుదల చేసింది. పరీక్షలకు హాజరయ్యే అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్ upsc.gov.in నుంచి దరఖాస్తు చేసుకోవచ్చు. ఇక యూపీఎస్సీ ఐఈఎస్/ఐఎస్‌ఎస్ పరీక్షలు జూన్ 24, 25, 26 తేదీల్లో నిర్వహించబడతాయి. ఈ పరీక్షలు రెండు సెషన్లలో జరుగుతాయి. ఉదయం 9 గంటల నుంచి మద్యాహ్నం 12 గంటల వరకు, మద్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు జరుగుతాయి. మొత్తం 53 ఖాళీల భర్తీకిగానూ ఈ పరీక్షలు జరగనున్నాయి. వీటిల్లో 24 ఇండియన్ ఎకనామిక్ సర్వీస్ పోస్టులుండగా, మిగిలిన 29 ఇండియన్ స్టాటిస్టికల్ సర్వీస్ (ISS) పోస్టులకు కమిషన్ నోటిఫికేషన్ విడుదల చేసింది.
కాగా ఈ రోజు (జూన్ 5) దేశ వ్యాప్తంగా యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ 2022 ప్రిలిమినరీ పరీక్ష జరిగింది. మొత్తం రెండు సెషన్లలో జరిగిన ఈ పరీక్ష ప్రశ్నాపత్నం కఠినంగా ఉన్నట్లు అభ్యర్థులు పేర్కొన్నారు. దీంతో కటాఫ్ తక్కువగా వెలువడే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. యూపీఎస్సీ సివిల్స్ 2023 ప్రిలిమ్స్ మే 28న జరగనున్నట్లు ఇప్పటికే కమిషన్ విడుదల చేసిన ఎగ్జామినేషన్ క్యాలెండర్ ద్వారా తెలియజేసింది.