UPSC EPFO ​​DAF Recruitment 2021: EPFO ఎన్‌ఫోర్స్‌మెంట్ ఆఫీసర్ జాబ్స్ నోటిఫికేషన్.. నేడే చివరి తేదీ..

|

Nov 22, 2021 | 6:28 AM

UPSC EPFO ​​DAF Recruitment 2021: ఎన్‌ఫోర్స్‌మెంట్ ఆఫీసర్, అకౌంట్ ఆఫీసర్ పోస్టులకు సంబంధించి యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నోటిఫికేషన్ జారీ చేసింది.

UPSC EPFO ​​DAF Recruitment 2021: EPFO ఎన్‌ఫోర్స్‌మెంట్ ఆఫీసర్ జాబ్స్ నోటిఫికేషన్.. నేడే చివరి తేదీ..
Jobs
Follow us on

UPSC EPFO ​​DAF Recruitment 2021: ఎన్‌ఫోర్స్‌మెంట్ ఆఫీసర్, అకౌంట్ ఆఫీసర్ పోస్టులకు సంబంధించి యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవడానికి ఇవాళ ఒక్కరోజు మాత్రమే గడువు ఉంది. అంటే 22 నవంబర్ 2021 సాయంత్రం వరకు దరఖాస్తు చేసుకోవాలి. ఆసక్తిగల అభ్యర్థులు దరఖాస్తు చేయడానికి అధికారిక వెబ్‌సైట్ upsc.gov.inని సందర్శించండి. తద్వారా ఆన్‌లైన్‌లో అప్లై చేసుకోవచ్చు.

UPSC జారీ చేసిన ప్రకటన ప్రకారం.. ఎన్‌ఫోర్స్‌మెంట్ ఆఫీసర్, అకౌంట్ ఆఫీసర్ పోస్టులు మొత్తం 421 ఖాళీలు ఉన్నాయి. ఈ పోస్టుల కోసం దరఖాస్తు ప్రక్రియ 2 నవంబర్ 2021 నుండి ప్రారంభమైంది. ఈ పోస్టులకు ఫీజు సబ్మిషన్ తేదీ కూడా ఇవాళే చివరి రోజు. దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు.. ముందుగా నోటిఫికేషన్‌ను పరిశీలించండి.

దరఖాస్తు ప్రక్రియ
దరఖాస్తు చేయడానికి ముందుగా upsc.gov.in అధికారిక వెబ్‌సైట్‌కి వెళ్లండి.
వెబ్‌సైట్ హోమ్ పేజీలో ఇచ్చిన What’s New ఆప్షన్‌కు వెళ్లండి.
ఇప్పుడు DAF లింక్‌కి వెళ్లండి: 421 ఎన్‌ఫోర్స్‌మెంట్ ఆఫీసర్ పోస్టులు – అకౌంట్స్ ఆఫీసర్, EPFO.
ఇక్కడ ఆన్‌లైన్‌లో దరఖాస్తు లింక్‌పై క్లిక్ చేయండి.
ఇప్పుడు అభ్యర్థించిన వివరాలను పూరించడం ద్వారా రిజిస్ట్రేషన్ ప్రక్రియను పూర్తి చేయండి.
రిజిస్ట్రేషన్ తర్వాత మీరు దరఖాస్తు ఫారమ్‌ను నింపవచ్చు.
దరఖాస్తు ప్రక్రియ పూర్తయిన తర్వాత, ప్రింట్ అవుట్ తీసుకోండి.

పోస్టుల వివరాలు..
యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (UPSC) ఎంప్లాయ్‌మెంట్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్‌లో ఎన్‌ఫోర్స్‌మెంట్ ఆఫీసర్, అకౌంట్ ఆఫీసర్ పోస్టులు మొత్తం 421 ఖాళీలు ఉండగా.. వీటిక భర్తీ కోసం ప్రకటన విడుదల చేసింది. ఈ పోస్టుల్లో జనరల్ కేటగిరీకి 168 పోస్టులు, OBCకి 116 పోస్టులు, ఆర్థికంగా వెనుకబడిన వారికి 42 పోస్టులు అంటే EWS కేటగిరీకి, SC కేటగిరీకి 33 పోస్టులు కేటాయించడం జరిగింది.

ఎంపిక ప్రక్రియ..
వ్రాత పరీక్ష, ఇంటర్వ్యూ రౌండ్ ఉంటుంది. ఎంపికైన అభ్యర్థులు ఎంప్లాయ్‌మెంట్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (EPFO), మినిస్ట్రీ ఆఫ్ లేబర్ అండ్ ఎంప్లాయ్‌మెంట్‌లో ఎన్‌ఫోర్స్‌మెంట్ ఆఫీసర్ లేదా అకౌంట్స్ ఆఫీసర్‌గా నియమితులవుతారు. రిక్రూట్‌మెంట్ టెస్ట్, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపికైన అభ్యర్థులకు వెయిటేజీ 75:25 నిష్పత్తిలో ఉంటుంది.

Also read:

Viral Video: ఫోన్‌ వాడటం మొదలెడితే.. మాకన్న ఎవరూ వాడలేరంటున్న కోతులు.. ఫన్నీ వీడియో

Beware: ఫ్రీజ్‌లో ఆ 8 ఆహార పదార్థాలను ఎప్పుడూ ఉంచవద్దు.. ఎందుకో తెలిస్తే షాకే..

AP Rains: ప్రయాణికులకు అలెర్ట్‌.. భారీ వర్షాల కారణంగా 18 రైళ్లు రద్దు.. పలు సర్వీసులు దారి మళ్లింపు..