UPSC Prelims 2022: యూపీఎస్సీ సివిల్‌ సర్వీసెస్‌ ప్రిలిమ్స్‌ పరీక్ష హాల్‌ టికెట్లు విడుదల.. పరీక్ష ఎప్పుడంటే..

|

May 11, 2022 | 10:48 AM

యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (UPSC) సివిల్ సర్వీసెస్ ప్రిలిమ్స్ 2022 అడ్మిట్ కార్డులు మంగళవారం (మే 10) విడుదలయ్యాయి. సివిల్ సర్వీసెస్ ప్రిలిమ్స్ పరీక్షకు..

UPSC Prelims 2022: యూపీఎస్సీ సివిల్‌ సర్వీసెస్‌ ప్రిలిమ్స్‌ పరీక్ష హాల్‌ టికెట్లు విడుదల.. పరీక్ష ఎప్పుడంటే..
Upsc Prelims 2022
Follow us on

UPSC Civil Services Prelims Admit Card 2022 download: యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (UPSC) సివిల్ సర్వీసెస్ ప్రిలిమ్స్ 2022 అడ్మిట్ కార్డులు మంగళవారం (మే 10) విడుదలయ్యాయి. సివిల్ సర్వీసెస్ ప్రిలిమ్స్ పరీక్షకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు యూపీఎస్సీ అధికారిక వెబ్‌సైట్ upsc.gov.in లేదా upsconline.nic.in. నుంచి అడ్మిట్ కార్డులను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. సివిల్ సర్వీసెస్ పరీక్ష జూన్ 5న దేశ వ్యాప్తంగా పలు పరీక్ష కేంద్రాల్లో నిర్వహించబడుతుంది. అధికారిక నోటీసు ప్రకారం, పరీక్షకు హాజరయ్యే అభ్యర్థులు తప్పనిసరిగా పరీక్ష కేంద్రానికి తీసుకువెళ్లాలి. దీనితోపాటు ఒరిజినల్‌ ఫొటో ఐడెంటిటీ కార్డును తీసుకెళ్లాలి. లేదంటే పరీక్ష హాలులోకి ప్రవేశించేందుకు అనుమతి ఇవ్వబడదు.

యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ ప్రిలిమ్స్ 2022 అడ్మిట్ కార్డును ఎలా డౌన్‌లోడ్ చేసుకోవాలంటే..

  • ముందుగా యూపీఎస్సీ అధికారిక వెబ్‌సైట్‌ upsc.gov.inను ఓపెన్‌ చెయ్యాలి.
  • హోమ్ పేజీలో కనిపించే UPSC Civil Services Prelims Admit Card 2022 లింక్‌పై క్లిక్ చెయ్యాలి.
  • లాగిన్ వివరాలను నమోదు చేసి, సబ్‌మిట్‌పై క్లిక్ చెయ్యాలి.
  • స్క్రీన్‌పై అడ్మిట్ కార్డ్ ఓపెన్‌ అవుతుంది.
  • వివరాలన్ని చెక్‌ చేసుకుని అడ్మిట్ కార్డును డౌన్‌లోడ్ చేసుకోవాలి.

Also Read:

Coconut Milk Tea: కొబ్బరి పాలతో తయారు చేసిన టీ ఎప్పుడైనా తాగారా? మీ చర్మ కాంతి..