UPSC Civils Mains 2025 Exam: మరో వారంలో యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ మెయిన్స్ 2025 పరీక్షలు.. అడ్మిట్‌ కార్డుల డౌన్‌లోడ్‌ లింక్‌ ఇదే

యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్ (CSE) మెయిన్స్ 2025 రాత పరీక్షల షెడ్యూల్‌ ఇప్పటికే విడుదలైన సంగతి తెలిసిందే. ఈ పరీక్షలకు సంబంధించిన అడ్మిట్ కార్డులను తాజాగా యూపీఎస్సీ విడుదల చేసింది. సివిల్‌ సర్వీసెస్ ప్రిలిమినరీ పరీక్షల్లో క్వాలిఫై అయినవారందరూ మెయిన్స్‌ రాయడానికి..

UPSC Civils Mains 2025 Exam: మరో వారంలో యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ మెయిన్స్ 2025 పరీక్షలు.. అడ్మిట్‌ కార్డుల డౌన్‌లోడ్‌ లింక్‌ ఇదే
UPSC Civils Mains 2025 Exams

Updated on: Aug 15, 2025 | 2:17 PM

హైదరాబాద్‌, ఆగస్ట్‌ 15: యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (యూపీఎస్సీ) సివిల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్ (CSE) మెయిన్స్ 2025 రాత పరీక్షల షెడ్యూల్‌ ఇప్పటికే విడుదలైన సంగతి తెలిసిందే. ఈ పరీక్షలకు సంబంధించిన అడ్మిట్ కార్డులను తాజాగా యూపీఎస్సీ విడుదల చేసింది. సివిల్‌ సర్వీసెస్ ప్రిలిమినరీ పరీక్షల్లో క్వాలిఫై అయినవారందరూ మెయిన్స్‌ రాయడానికి అవకాశం ఉంటుంది. వీరికి ఆగస్టు 22, 23, 24, 30, 31 తేదీల్లో మెయిన్స్‌ పరీక్షలు జరగనున్నాయి. ఆయా తేదీల్లో ప్రతిరోజూ రెండు సెషన్‌లలో ఈ పరీక్షలు నిర్వహించనున్నారు. ఉదయం షిఫ్ట్ 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు, మధ్యాహ్నం షిప్ట్‌ 2:30 నుంచి సాయంత్రం 5:30 గంటల వరకు జరుగుతుంది. అభ్యర్థులు తమ రిజిస్ట్రేషన్‌ ఐడీ లేదా రోల్‌ నంబర్‌ అధికారిక వెబ్‌సైట్‌లో ఎంటర్‌ చేసి హాల్ టిక్కెట్లను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.

యూపీఎస్సీ మెయిన్స్ 2025 అడ్మిట్‌ కార్డుల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి.

ఆగస్టు 20 నుంచి తెలంగాణ ఐసెట్‌ కౌన్సెలింగ్‌ ప్రారంభం

తెలంగాన రాష్ట్రంలోని ఎంబీఏ, ఎంసీఏ కాలేజీల్లో 2025-26 విద్యా సంవత్సరానికి సంబంధించి సీట్ల భర్తీ కోసం ఆగస్ట్‌ 20 నుంచి కౌన్సెలింగ్‌ నిర్వహించనున్నారు. ఈ మేరకు రాష్ట్ర ఉన్నత విద్యామండలి షెడ్యూల్‌ విడుదల చేసింది. ఇందుకు సంబంధించిన నోటిఫికేషన్‌ ఆగస్ట్ 18న జారీ చేయనున్నారు. తొలి దశ కౌన్సెలింగ్‌ ఆగస్ట్‌ 20న ప్రారంభమై సెప్టెంబర్‌ 5వ తేదీ వరకు జరుగుతుంది. రెండో దశ కౌన్సెలింగ్‌ సెప్టెంబర్‌ 8న నుంచి 16వ తేదీ వరకు ఉంటుంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని విద్యా, ఉద్యోగ వార్తల కోసం క్లిక్‌ చేయండి.