CBI Jobs: సీబీఐలో పనిచేయాలనుకుంటున్నారా? డిగ్రీ అర్హత ఉంటే చాలు

|

Nov 11, 2024 | 3:37 PM

CBI Assistant Programmer Jobs: యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్‌ (యూపీఎస్సీ) తాజాగా అసిస్టెంట్ ప్రోగ్రామర్ పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేసింది. డిగ్రీ అర్హత కలిగిన వారు ఎవరైనా దరఖాస్తు చేసుకోవచ్చు. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు ఈ కింద తెలుసుకోండి..

CBI Jobs: సీబీఐలో పనిచేయాలనుకుంటున్నారా? డిగ్రీ అర్హత ఉంటే చాలు
CBI Assistant Programmer Jobs
Follow us on

యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్‌ (యూపీఎస్సీ).. సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్, డిపార్ట్‌మెంట్ ఆఫ్ పర్సనల్ అండ్ ట్రైనింగ్, మినిస్ట్రీ ఆఫ్ పర్సనల్, పబ్లిక్ గ్రీవెన్స్ అండ్‌ పెన్షన్‌ వంటి ప్రతిష్టాత్మక సంస్థల్లో పలు ఉద్యోగాల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్‌ కింద మొత్తం 27 అసిస్టెంట్ ప్రోగ్రామర్ పోస్టులను భర్తీ చేయనున్నారు. బ్యాచిలర్‌ డిగ్రీ పూర్తి చేసిన అభ్యర్ధులు దరఖాస్తు చేసుకోవచ్చు. ఆసక్తి కలిగిన అభ్యర్థులు నవంబర్‌ 28, 2024వ తేదీలోగా ఆన్‌లైన్‌ విధానంలో దరఖాస్తు చేసుకోవచ్చు.

కేటగిరీల వారీగా ఖాళీల వివరాలు ఇలా..

అసిస్టెంట్ ప్రోగ్రామర్ పోస్టుల సంఖ్య: 27

  • యూఆర్‌ కేటగిరీలో పోస్టులు: 08
  • ఈడబ్ల్యూఎస్‌ కేటగిరీలో పోస్టులు: 04
  • ఓబీసీ కేటగిరీలో పోస్టులు: 9
  • ఎస్సీ కేటగిరీలో పోస్టులు: 4
  • ఎస్టీ కేటగిరీలో పోస్టులు: 2

ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్ధులు కంప్యూటర్ ఇంజినీరింగ్/ కంప్యూటర్ సైన్స్/ కంప్యూటర్ టెక్నాలజీ విభాగంలో బీఈ, బీటెక్‌ లేదా కంప్యూటర్ అప్లికేషన్/ ఎలక్ట్రానిక్స్/ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజినీరింగ్/ కంప్యూటర్ సైన్స్ విభాగంలో బ్యాచిలర్ డిగ్రీలో ఉత్తీర్ణత పొంది ఉండాలి. అలాగే సంబంధిత పనిలో రెండేళ్ల పని అనుభవం కూడా ఉండాలి. లేదా కంప్యూటర్ అప్లికేషన్/ కంప్యూటర్ సైన్స్‌లో మాస్టర్స్ డిగ్రీ లేదా కంప్యూటర్ అప్లికేషన్‌ స్పెషలైజేషన్‌ విభాగంలో మాస్టర్ ఆఫ్ టెక్నాలజీ కోర్సులో ఉత్తీర్ణులై ఉండాలి.

అభ్యర్ధుల గరిష్ఠ వయో పరిమితి నవంబర్ 29, 2024 నాటికి అన్‌రిజర్వ్‌డ్‌/ ఈడబ్ల్యూఎస్‌ అభ్యర్థులకు 30 ఏళ్లు, ఓబీసీలకు 33 ఏళ్లు, ఎస్సీ/ ఎస్టీలకు 35 ఏళ్లు మించకుండా ఉండాలి. ఆసక్తి కలిగిన వారు ఆన్‌లైన్‌ విధానంలో నవంబర్‌ 28, 2024వ తేదీ రాత్రి 11 గంటల 59 నిమిషాలలోగా దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తు రుసుము కింద ప్రతి ఒక్కరూ రూ.25 చెల్లించాలి. మహిళలు/ ఎస్సీ/ ఎస్టీ/ దివ్యాంగులకు ఫీజు చెల్లింపు నుంచి మినహాయింపు వర్తిస్తుంది. రాత పరీక్ష, ఇంటర్వ్యూ, డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ ఆధారంగా తుది ఎంపిక ఉంటుంది. ఇతర వివరాలు అధికారిక నోటిఫికేషన్‌లో చెక్‌ చేసుకోవచ్చు.

ఇవి కూడా చదవండి

యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్- సీబీఐలో అసిస్టెంట్ ప్రోగ్రామర్ పోస్టుల అధికారిక నోటిఫికేషన్‌ కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి.

మరిన్ని విద్యా, ఉద్యోగ వార్తల కోసం క్లిక్‌ చేయండి.