Civil Services Interview: సివిల్ సర్వీసెస్ పరీక్షలకు సంబంధించిన యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కీలక ప్రకటన విడుదల చేసింది. ఆగస్టు 2వ తేదీ నుంచి సివిల్ సర్వీసెస్ పరీక్షలకు ఇంటర్వ్యూలు నిర్వహించనున్నట్లు ప్రకటించింది. ఈ ఇంటర్వ్యూలకు సంబంధించిన ఈ-కాల్ లెటర్లను త్వరలోనే వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచుతామని యూపీఎస్సీ అధికారులు తెలిపారు. వెబ్‌సైట్‌లొ పొందుపరిచిన తరువాత నోటిఫికేషన్ విడుదల చేస్తామని, అభ్యర్థులు ఈ కాల్ లెటర్లను డౌన్‌లోడ్ చేసుకోవచ్చునని తెలిపారు. కరోనా వ్యాప్తి నేపథ్యంలో వాయిదా అంటూ సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో ఇంటర్వ్యూలకు హాజరయ్యే అభ్యర్థులు.. దీనిపై అప్రమత్తండా ఉండాలని సూచించారు అధికారులు.
ఇదిలాఉంటే.. వాస్తవానికి ఏప్రిల్ నెలలోనే సివిస్ సర్వీసెస్ సెలక్షన్స్‌కు ఇంటర్వ్యూలు నిర్వహించాల్సి ఉంది. అయితే, అదే సమయంలో కరోనా వైరస్ వ్యాప్తి ఉధృతంగా ఉండటంతో ఇంటర్వ్యూలను వాయిదా వేస్తూ నిర్ణయం తీసుకుంది యూపీఎస్సీ. ప్రస్తుతం దేశంలో కరోనా వ్యాప్తి తగ్గుముఖం పట్టడంతో ఇంటర్వ్యూల నిర్వహణకు సిద్ధమైంది. కాగా, యూపీఎస్సీ ఆధ్వర్యంలో ఏటా నిర్వహించే సివిల్ సర్వీసెస్ పరీక్షల ద్వారా ఐఏఎస్, ఐఎఫ్‌ఎస్, ఐపీఎస్, ఇతర ఆలిండియా సర్వీసెస్ ఖాళీలను భర్తీ చేస్తారనే విషయం తెలిసిందే.
Also read:
బ్యాంక్ కస్టమర్లకు హెచ్చరిక…జూన్ 30 లోపు కచ్చితంగా చేయాల్సిన పనులు ఇవే.. లేదంటే ఇబ్బందులు తప్పవు…