University Of Hyderabad Recruitment 2021: హైదరాబాద్‌లోని గచ్చిబౌలిలో ఉన్న యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ (యూఓహెచ్)లో పలు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేన్ జారీ చేశారు. నోటిఫికేషన్‌లో భాగంగా ప్రోగ్రాం మేనేజర్, ఆఫీస్ అటెండెంట్ ఖాళీలను భర్తీ చేయనున్నారు. దరఖాస్తుల స్వీకణ రేపటితో (14-06-2021) ముగియనుంది ఈ నేపథ్యంలో నోటిఫికేషన్‌కు సంబంధించిన పూర్తి వివరాలపై ఓ లుక్కేయండి..
* నోటిఫికేషన్‌లో భాగంగా ప్రోగ్రాం మేనేజర్లు (03), ఆఫీస్ అటెండెంట్ (01) పోస్టులను భర్తీ చేయనున్నారు.
* ప్రోగ్రాం మేనేజర్ పోస్టుకు దరఖాస్తు చేసుకునే వారు.. పోస్టు గ్రాడ్యుయేషన్/ ఎంబీఏలో ఉత్తీర్ణులై ఉండాలి. వీటితో పాటు సంబంధిత విభాగంలో పని అనుభవంతో పాటు కమ్యూనికేషన్స్ స్కిల్స్ ఉండాలి.
* ఆఫీస్ అటెండెంట్ పోస్టుకు దరఖాస్తు చేసుకునే వారు.. సెకండరీ ఎడ్యుకేషన్ ఉత్తీర్ణతతో పాటు ఆఫీస్ అటెండెంట్‌గా పని చేసిన అనుభవం ఉండాలి. వీటితో పాటు ఇంగ్లిష్ చదవడం, రాయడం తెలిసి ఉండాలి.
* ప్రోగ్రాం మేనేజర్ పోస్టుకు ఎంపికైన వారికి నెలకు రూ. 35,000 జీతంగా అందిస్తారు. ఆఫీస్ అటెండెంట్ ఉద్యోగానికి ఎంపికైన వారికి నెలకు రూ. 15,000 జీతంగా అందిస్తారు.
* అభ్యర్థులను షార్ట్‌లిస్టింగ్, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు.
* అర్హత, ఆసక్తి ఉన్న అభ్యర్థులు ఆఫ్‌లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
* పూర్తి వివరాలను గచ్చిబౌలిలోని యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ అడ్రస్‌కు పంపించాలి.
* దరఖాస్తుల స్వీకరణ నేటితో (25-06-2021) ముగియనుంది.
* పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
Also Read: TSRJC CET 2021: విద్యార్థులూ బీ అలర్ట్.. టీఎస్ఆర్‌జేసీ సెట్-2021 ఫలితాల విడుదల..