Central Govt Jobs: 9,64 లక్షల కేంద్ర కొలువులు ఖాళీగా.. ఎప్పటికి భర్తీ చేస్తారో?

|

Jul 21, 2023 | 1:22 PM

కేంద్ర ప్రభుత్వ పరిధిలోని వివిధ మంత్రిత్వ శాఖలు, విభాగాల్లో దాదాపు 9,64,359 ఉద్యోగాలు ఖాళీగా ఉన్నట్లు కేంద్ర సిబ్బంది వ్యవహారాలు-శిక్షణ శాఖ మంత్రి జితేంద్రసింగ్‌ తెలిపారు. రాజ్యసభలో జులై 20న‌ లిఖితపూర్వక ప్రశ్నకు ఆయన ఈ మేరకు..

Central Govt Jobs: 9,64 లక్షల కేంద్ర కొలువులు ఖాళీగా.. ఎప్పటికి భర్తీ చేస్తారో?
Minister Jitendra Singh
Follow us on

న్యూఢిల్లీ, జులై 21: కేంద్ర ప్రభుత్వ పరిధిలోని వివిధ మంత్రిత్వ శాఖలు, విభాగాల్లో దాదాపు 9,64,359 ఉద్యోగాలు ఖాళీగా ఉన్నట్లు కేంద్ర సిబ్బంది వ్యవహారాలు-శిక్షణ శాఖ మంత్రి జితేంద్రసింగ్‌ తెలిపారు. రాజ్యసభలో జులై 20న‌ లిఖితపూర్వక ప్రశ్నకు ఆయన ఈ మేరకు బదులిచ్చారు. కేంద్రంలోని అన్ని విభాగాలకు కలిపి మొత్తం 39,77,509 పోస్టులు మంజూరు చేయగా.. వాటిల్లో ప్రస్తుతం 30,13,150 మంది ఉద్యో్గులు పనిచేస్తున్నట్లు వెల్లడించారు.

గ్రూప్‌-ఎ పోస్టులు 30,606, గ్రూప్‌-బి పోస్టులు18,011, గ్రూప్‌-బి నాన్‌గెజిటెడ్‌ పోస్టులు 93,803, గ్రూప్‌-సి పోస్టులు 8,21,939 ఖాళీగా ఉన్నట్లు మంత్రి తెలిపారు. రైల్వేలో 3,09,074 పోస్టులు, రక్షణ రంగంలో 2,32,134 పోస్టులు, హోంశాఖలో 1,20,933 పోస్టులు అత్యధికంగా ఖాళీగా ఉన్నాయన్నారు. గతచిన ఐదేళ్లలో 4.63 లక్షల ఖాళీలు భర్తీ చేశామని, ప్రస్తుతం ఖాళీగా ఉన్న పోస్టులను కూడా సకాలంలో నోటిఫికేషన్లు ఇచ్చి ఉద్యోగ ఖాళీలు భర్తీ చేయాలని అన్నిశాఖల్ని ఆదేశించినట్లు ఆయన వివరించారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని తాజా విద్యా, ఉద్యోగ సమాచారం కోసం క్లిక్‌ చేయండి.