MBBS in Hindi Medium: హిందీ మీడియంలో ఎంబీబీఎస్‌ కోర్సు.. అపూర్వ ఘట్టంగా అభివర్ణించిన అమిత్ షా

హిందీ మీడియంలో ఎంబీబీఎస్‌ కోర్సును కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా అదివారం (అక్టోబర్‌ 16) మధ్యప్రదేశ్‌లో ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఎంబీబీఎస్‌ సబ్జెక్టులైన అనాటమీ, ఫిజియాలజీ, బయోకెమిస్ట్రీలకు సంబంధించిన మూడు ఎంబీబీఎస్‌ హిందీ టెక్ట్స్‌ బుక్‌లను..

MBBS in Hindi Medium: హిందీ మీడియంలో ఎంబీబీఎస్‌ కోర్సు.. అపూర్వ ఘట్టంగా అభివర్ణించిన అమిత్ షా
Amit Shah launches Hindi version of MBBS
Follow us
Srilakshmi C

|

Updated on: Oct 17, 2022 | 12:36 PM

హిందీ మీడియంలో ఎంబీబీఎస్‌ కోర్సును కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా అదివారం (అక్టోబర్‌ 16) మధ్యప్రదేశ్‌లో ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఎంబీబీఎస్‌ సబ్జెక్టులైన అనాటమీ, ఫిజియాలజీ, బయోకెమిస్ట్రీలకు సంబంధించిన మూడు ఎంబీబీఎస్‌ హిందీ టెక్ట్స్‌ బుక్‌లను షా ఆవిష్కరించారు. మాతృభాషలో మెడికల్‌ విద్యను అధ్యయనం చేస్తే మెదడుకు త్వరగా చేరుతుందని ఆయన ఈ సందర్భంగా అన్నారు. ఇంకా ఈ విధంగా మాట్లాడారు..

‘చరిత్రలో ఈ రోజు చిరస్థాయిగా నిలిచిపోతుంది. దేశంలో హిందీ మాధ్యమంలో ఎంబీబీఎస్‌ కోర్సును ప్రారంభించిన తొలి రాష్ట్రంగా మధ్యప్రదేశ్‌ రికార్డు సాధించింది. ఇది విద్యారంగంలో విప్లవాత్మకమైన ఘట్టం. ఈ ఘనత ప్రధాని నరేంద్ర మోదీకే దక్కుతుంది. ప్రధాని నరేంద్ర మోదీ ఇంటర్నేషనల్‌ ప్లాట్‌ఫాంలపై హిందీలోనే తన సందేశాన్ని అందిస్తుంటారు. దేశ యువతలో ఇది నమ్మకాన్ని పెంచుతుంది. ప్రధాని యువతకు ఆదర్శం. హిందీ మీడియంతో పాటు ఇతర ప్రాంతీయ భాషల్లో మెడికల్, ఇంజినీరింగ్ వంటి ప్రొఫెషనల్ కోర్సుల్లో విద్యను అందించాలనే లక్ష్యంతో మోదీ పనిచేస్తున్నారు. తత్ఫలితంగా మన భాషలకు ప్రాధాన్యం లభిస్తుంది. ఈ 21వ శతాబ్ధంలో కొంతమంది ‘బ్రెయిన్‌ డ్రైన్‌’ థియరీ ద్వారా ఇంగ్లీష్‌ను బలవంతంగా ప్రమోట్ చేస్తున్నారు. భాషను మేధో సామర్థ్యంతో ముడిపెట్టడం సరికాదు. ఇంగ్లీషు భాషకు మేధో సామర్థ్యానికి సంబంధం లేదు. భాష అనేది కమ్యూనికేషన్‌కు ఓ సాధనం మాత్రమే. మేధో సామర్థ్యం దేవుడిచ్చింది. మాతృభాషలో విద్యను అందిస్తే అది విద్యార్ధుల్లో మేధో సామర్థ్యాన్ని పెంచుతుంది. విద్యార్ధులు విషయాన్ని బాగా గ్రహిస్తారు. దేశంలో ఇప్పటికే 8 రాష్ట్రాలు తమ మాతృభాషలో ఇంజనీరింగ్ టెక్ట్స్ బుక్‌లను సిద్ధం చేసే పనిని ప్రారంభించాయి. రీసెర్చ్‌, డెవలప్‌మెంట్ కార్యక్రమాలను కూడా త్వరలోనే ప్రాంతీయ భాషల్లో ప్రారంభిస్తామ’ని షా అన్నారు.

ఇవి కూడా చదవండి

ఈ సందర్భంగా మధ్యప్రదేశ్‌ ముఖ్యమంత్రి శివరాజ్‌సింగ్‌ చౌహాన్‌ మాట్లాడుతూ.. ప్రాంతీయ భాషల్లో మెడికల్‌, ఇంజినీరింగ్‌ విద్య లేకపోవడం వల్ల వెనుకబడిన వర్గాలు, పేద కుటుంబాల పిల్లలు తీవ్రంగా నష్టపోతున్నారని అన్నారు. స్వాతంత్య్రానంతరం ఇంగ్లిష్‌ మాద్యమంలో విద్యాభ్యాసం కొనసాగించడంపై చౌహాన్ కాంగ్రెస్‌ను ఎద్దేవా చేశారు. ఇంగ్లిష్‌లో మాట్లాడితే సొసైటీలో గౌరవం పొందే కల్చర్‌ను సృష్టించారని ఆయన ఆరోపణలు చేశారు. మరోవైపు ఎంబీబీఎస్ వంటి ప్రతిష్ఠాత్మక కోర్సులను హిందీ మాధ్యమంలో బోధిస్తే.. కెరీర్ పరంగా విద్యార్ధులకు తీరని నష్టం వాటిల్లుతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. వ్యతిరేకతలను పట్టించుకోకుండా తమ పంతం నెగ్గించుకుందని, అనుకున్నంత పని చేశారని బీజేపీ ప్రభుత్వాన్ని ఏకి పారేస్తున్నారు.