UGC NET Results 2023: యూజీసీ నెట్‌-2023 ఫలితాలు విడుదల.. ఒక్క క్లిక్‌తో నేరుగా ఇక్కడ చెక్‌చేసుకోండి

|

Jul 26, 2023 | 12:30 PM

యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ నేషనల్ ఎలిజిబిలిటీ టెస్ట్ జూన్‌ 2023 (యూజీసీ- నెట్‌) పరీక్ష ఫలితాలు ఎన్టీయే విడుదల చేసింది. పరీక్ష రాసిన అభ్యర్థులు..

UGC NET Results 2023: యూజీసీ నెట్‌-2023 ఫలితాలు విడుదల.. ఒక్క క్లిక్‌తో నేరుగా ఇక్కడ చెక్‌చేసుకోండి
UGC NET Result 2023
Follow us on

న్యూఢిల్లీ, జులై 26: యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ నేషనల్ ఎలిజిబిలిటీ టెస్ట్ జూన్‌ 2023 (యూజీసీ- నెట్‌) పరీక్ష ఫలితాలు ఎన్టీయే విడుదల చేసింది. పరీక్ష రాసిన అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్‌ లో ఫలితాలు చెక్‌ చేసుకోవచ్చు. అభ్యర్ధుల అప్లికేషన్‌ నంబర్‌, పుట్టిన తేదీ వివరాలను నమోదు చేసి ఫలితాలు చెక్‌ చేసుకోవచ్చని ఎన్టీయే సూచించింది.

ఈ ఏడాడి జూన్‌ 13 నుంచి జూన్‌ 22 వరకు ఆన్‌లైన్ విధానంలో యూజీసీ నెట్‌ పరీక్షతు జరిగిన సంగతి తెలిసిందే. మొత్తం 83 సబ్జెక్టులకు 9 రోజులపాటు రోజుకి రెండు షిఫ్టుల చొప్పున దేశవ్యాప్తంగా 181 నగరాల్లోని పరీక్ష కేంద్రాల్లో ఈ పరీక్ష నిర్వహించారు. దేశ వ్యాప్తంగా దాదాపు 6,39,069 మంది అభ్యర్థులు ఈ పరీక్షకు హాజరయ్యారు. యూజీసీ నెట్‌ ఫలితాలతోపాటు తుది ఆన్సర్‌ కీ కూడా వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచింది. దేశ వ్యాప్తంగా ఉన్న యూనివర్సిటీల్లో లెక్చరర్‌షిప్, జూనియర్ రిసెర్చ్ ఫెలోషిప్ కోసం యూజీసీ నెట్ పరీక్షను ఏటా రెండు సార్లు ఎన్‌టీఏ నిర్వహిస్తోంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి.