UGC NET JRF 2022 validity extended: యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (UGC) జూనియర్ రీసెర్చ్ ఫెలోషిప్ (JRF) అవార్డ్ లెటర్ వ్యాలిడిటీని మరో ఏడాది పాటు పొడిగిస్తున్నట్లు మార్చి 28న ప్రకటన విడుదల చేసింది. ఈ విషయాన్ని యూజీసీ చైర్మన్ జగదీష్ కుమార్ ట్విట్టర్ ద్వారా స్వయంగా ప్రకటించారు. కరోనా మహమ్మారి క్లిష్ట పరిస్థితుల దృష్ట్యా యూజీసీ నెట్ అర్హత సాధించిన అభ్యర్ధులందరికీ జేఆర్‌ఎఫ్ చెల్లుబాటు కాల వ్యవధిని మరో ఏడాదిపాటు (సాధారణంగా 3 ఏళ్లు ఉంటుంది) పొడిగిస్తున్నట్లు కమిషన్ ప్రకటించింది. కోవిడ్ 19 మహమ్మారి కారణంగా విధించిన లాక్‌డౌన్ వల్ల నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) డిసెంబర్ 2020, జూన్ 2021 సెషన్లకు సంబంధించిన యూజీసీ నెట్ పరీక్షలను నవంబర్ 20, 2021, జనవరి 5, 2022 తేదీల్లో నిర్వహించింది. ఇక ఈ పరీక్షలకు దాదాపు12 లక్షలకు పైగా నమోదు చేసుకున్నారు. దేశ వ్యాప్తంగా మొత్తం 239 నగరాల్లో.. 837 కేంద్రాలలో.. 81 సబ్జెక్టులలో జరిగాయి.
UGC has decided to extend the validity period of the JRF award letter up to one year (beyond the three year period) for all those UGC NET qualified candidates whose admission process was affected due to COVID 19 pandemic situation. The notification is being issued. pic.twitter.com/BWj90kGklO
— Mamidala Jagadesh Kumar (@mamidala90) March 28, 2022
Also Read: