UGC NET 2024 Exam Date: యూజీసీ నెట్‌కు మీరూ దరఖాస్తు చేసుకున్నారా? ఈ కీలక అప్ డేట్ మీ కోసమే

|

Dec 13, 2024 | 4:36 PM

యూనివర్సిటీలు, కాలేజీల్లో లెక్చరర్, ప్రొఫెసర్ పోస్టుల నియామకాలకు అర్హత ఇచ్చేందుకు నిర్వహించే యూజీసీ నెట్ డిసెంబర్ 2024 దరఖాస్తు గడువు ముగిసిన సంగతి తెలిసిందే. అయితే ఈ పరీక్షకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్ధులకు యూజీసీ కీలక అప్ డేట్ జారీ చేసింది. అదేంటంటే..

UGC NET 2024 Exam Date: యూజీసీ నెట్‌కు మీరూ దరఖాస్తు చేసుకున్నారా? ఈ కీలక అప్ డేట్ మీ కోసమే
UGC NET 2024 Exam
Follow us on

హైదరాబాద్‌, డిసెంబర్‌ 13: యూజీసీ నెట్‌ డిసెంబర్‌ 2024 పరీక్ష దరఖాస్తుల గడువు ముగిసిన సంగతి తెలిసిందే. డిసెంబర్‌ 11వ తేదీ రాత్రి 11.59 గంటలకు గడువు ముగిసింది. ఎన్‌టీఏ-యూజీసీ తాజా నిర్ణయం తీసుకున్నాయి. అలాగే, దరఖాస్తు రుసుం చెల్లింపు గడువు సైతం డిసెంబర్‌ 12వ తేదీతో ముగిసింది. దరఖాస్తుల్లో ఏవైనా తప్పులుంటే డిసెంబర్‌ 13, 14 తేదీల్లో సరిచేసుకొనేందుకు యూజీసీ అవకాశం ఇచ్చింది. దీంతో శుక్రవారం కరెక్షన్ విండ్‌ ఓపెన్‌ అయ్యింది. అభ్యర్ధులు ఎవరైనా అప్లికేషన్లో తమ వివరాలు సరిచేసుకోవల్సి ఉంటే.. ఈ అవకాశాన్ని వినియోగించుకోవచ్చు. జూనియర్‌ రిసెర్చి ఫెలోషిప్‌, విశ్వవిద్యాలయాల్లో అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ పోస్టులకు పోటీపడేందుకు ఉపయోగపడే ఈ పరీక్షను జనవరి 1 నుంచి 19వ తేదీ వరకు నిర్వహించనున్నట్టు ఇప్పటికే జాతీయ పరీక్షల సంస్థ (NTA) స్పష్టం చేసిన విషయం తెలిసిందే. మొత్తం 85 సబ్జెక్టుల్లో ఆన్‌లైన్‌ విధానంలో ఈ పరీక్షను నిర్వహించనున్నారు.

ఏపీ ఈఏపీసెట్‌ కౌన్సెలింగ్‌ పూర్తి.. తరగతులు ప్రారంభం

ఆంధ్రప్రదేశ్ ఈఏపీసెట్‌ బైపీసీ స్ట్రీమ్‌ ఇంజినీరింగ్, ఫార్మసీ సీట్లలో 79.72 శాతం సీట్లు భర్తీ అయ్యాయి. ఈ మేరకు విద్యార్ధులకు సీట్ల కేటాయింపు ప్రక్రియ ముగిసినట్లు కన్వీనర్‌ గణేష్‌ కుమార్‌ ఓ ప్రకటనలో తెలిపారు. ఆయా కాలేజీల్లో సీట్లు పొందిన విద్యార్థులు డిసెంబరు 14వ తేదీ లోపు చేరాల్సి ఉంటుందని ఆయన సూచించారు. డిసెంబరు 11వ తేదీ నుంచి తరగతులు కూడా ప్రారంభమయ్యాయి. ఈఏపీసెట్‌ బైపీసీ స్ట్రీమ్‌లో మొత్తం 12,555 సీట్లకుగానూ 10,010 మందికి సీట్లు కేటాయించినట్లు కన్వీనర్‌ గణేష్‌ కుమార్‌ వెల్లడించారు.

ప్రభుత్వ, ప్రైవేటు ఇంజినీరింగ్‌ కళాశాలల్లో కన్వీనర్‌ కోటా కింద 487 సీట్లు ఉండగా.. వాటిల్లో 286 భర్తీ అయ్యాయని ఆయన తెలిపారు. బీఫార్మసీలో 10,422 సీట్లు ఉండగా, వాటిల్లో 8,085 భర్తీ చేశామని తెలిపారు. ఫార్మ-డీలో 1,646 సీట్లకుగాను 1,639 భర్తీ అయ్యాయని తెలిపారు. ఇక క్రీడా కోటాలో ధ్రువపత్రాల పరిశీలన పూర్తికానందున ఆ కోటాలో 58 సీట్లు, ఎన్‌సీసీ కోటాలో 111 సీట్లను పెండింగ్‌లో పెట్టినట్లు తెలిపారు. దీంతో ఏపీలోని ఈఏపీసెట్‌ కౌన్సెలింగ్‌ ప్రక్రియ ముగిసినట్లైంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని విద్యా, ఉద్యోగ వార్తల కోసం క్లిక్‌ చేయండి.