Tv9-KAB – Education summit – Hyderabad: హైదరాబాద్‌లోని నిజాం కాలేజ్ గ్రౌండ్స్‌లో రేపటి (శనివారం) నుంచి టీవీ9-KAB ఎడ్యుకేషన్ సమ్మిట్ షురూ కాబోతోంది. మూడు రోజుల పాటు కొవిడ్ నిబంధనలు పాటిస్తూ ఈ సమ్మిట్ జరుగుతుంది. టీవీ9-KAB సంయుక్తంగా ప్రతి ఏడాది విద్యార్థులు, వారి తల్లిదండ్రులకు దిశానిర్దేశం చేసేందుకు ఎడ్యుకేషన్ సమ్మిట్ నిర్వహిస్తోన్న సంగతి తెలిసిందే. హైదరాబాద్‌లోని నిజాం కాలేజ్ గ్రౌండ్స్‌లో రేపటి నుంచి జరిగే ఈ సదస్సులొ విద్య, ఉద్యోగ సమాచారానికి సంబంధించి విద్యార్థులు, తల్లిదండ్రులకున్న డౌట్లన్నీ అల్‌క్లియర్ ఎట్ వన్ ప్లేస్ ఈ సమ్మిట్ ప్రత్యేకత.
ఈ ఏడాది కరోనా పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని.. ఎవరికీ, ఎలాంటి ఇబ్బంది రాకుండా సదస్సు నిర్వహణ ఏర్పాట్లు పూర్తయ్యాయి. రేపు ఉదయం 9 గంటలకు తెలంగాణ విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి చేతుల మీదుగా ప్రారంభోత్సవం జరుగుతుంది. టీవీ9, KAB సంయుక్తంగా నిర్వహిస్తున్న ఈ సమ్మిట్‌లో 100 పైగా విద్యా సంస్థలు స్టాల్స్ ఏర్పాటు చేస్తున్నాయి. KL యూనివర్సిటీ ప్రధాన స్వాన్సరర్‌గా వ్యవహరిస్తోంది. మూడు రోజులు ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 7 గంటల వరకు జరుగుతుంది.
హయ్యర్ ఎడ్యుకేషన్‌కి ఎలాంటి కోర్సులు చేయాలి..? ఏ రంగానికి ఉజ్వల భవిష్యత్ ఉంటుంది..? టార్గెట్‌ను రీచ్ అవ్వాలంటే ఏం చేయాలి.. ప్రిపరేషన్ ఎలా ఉండాలి..? ఇలా సందేహం ఏదైనా ఎక్స్‌పర్ట్స్ సమాధానం ఇస్తారు. ప్రవేశం ఉచితం. కౌన్సెలింగ్ కూడా ఫ్రీ. కాగా, రెండేళ్లుగా కరోనా పరిస్థితుల కారణంగా విద్యారంగం అస్తవ్యస్తమైంది. చదువులు అంతంతమాత్రంగా సాగాయి. కరోనా ఎన్నాళ్లుంటుందో.. ఎప్పుడు ఎండ్‌కార్డ్ పడుతుందో తెలీని పరిస్థితులు దాపురించాయి.
కరోనా ప్రభావం కొనసాగుతోన్నప్పటికీ చదువుల్ని నిర్లక్ష్యం చేయకూడదు. దీంతో.. విద్యార్థుల్లో, తల్లిదండ్రుల్లో ఎంతో కన్ఫ్యూజన్, మరెన్నో అనుమానాలు. ఈ నేపథ్యంలో అన్నింటినీ క్లియర్‌చేసి భవిష్యత్ మార్గనిర్దేశనం చేసేందుకు టీవీ9-KAB ఎడ్యుకేషన్ సమ్మిట్ ఏర్పాటు చేశారు. గత 14 ఏళ్లుగా ప్రతి ఏటా ఈ సమ్మిట్ జరుగుతూ గ్రాండ్ సక్సెస్ అవుతోంది. అదే జోష్‌తో ఈసారి టీవీ9-KAB సమ్మిట్‌కు ఏర్పాట్లు గ్రాండ్‌గా పూర్తయ్యాయి. ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోండి.