TTWREIS Recruitment 2022: మహబూబ్‌నగర్‌ ఏకలవ్య గురుకులాల్లో టీచింగ్‌ ఉద్యోగాలకు నోటిఫికేషన్‌ విడుదల.. ఆగస్టు 20న ఇంటర్వ్యూ..

తెలంగాణ రాష్ట్రంలోని నాగర్‌ కర్నూల్ జిల్లా కల్వకుర్తి, మహబూబ్‌నగర్ జిల్లా బాలానగర్‌లోని ఏకలవ్య మోడల్ గురుకుల పాఠశాలల్లో 2022-23 విద్యా సంవత్సరానికి..

TTWREIS Recruitment 2022: మహబూబ్‌నగర్‌ ఏకలవ్య గురుకులాల్లో టీచింగ్‌ ఉద్యోగాలకు నోటిఫికేషన్‌ విడుదల.. ఆగస్టు 20న ఇంటర్వ్యూ..
Ttwreis

Updated on: Aug 14, 2022 | 8:10 AM

TTWREIS Mahabubnagar Teaching Recruitment 2022: తెలంగాణ రాష్ట్రంలోని నాగర్‌ కర్నూల్ జిల్లా కల్వకుర్తి, మహబూబ్‌నగర్ జిల్లా బాలానగర్‌లోని ఏకలవ్య మోడల్ గురుకుల పాఠశాలల్లో 2022-23 విద్యా సంవత్సరానికి సంబంధించి తెలంగాణ గిరిజన సంక్షేమ గురుకుల విద్యాలయాల సంస్థ (TTWREIS).. ఒప్పంద ప్రాతిపదికన 24 పీజీటీ, టీజీటీ, ఆర్ట్ టీచర్, పీఈటీ, హాస్టల్ వార్డెన్, స్టూడెంట్ కౌన్సెలర్ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ఆసక్తి, అర్హత కలిగినవారు మహబూబ్‌ నగర్‌ జిల్లా పురపాలక అప్పన్నపల్లి పరిధిలోని తిరుమల హిల్స్‌లోనున్న టీటీడబ్ల్యూఆర్ఈఐఎస్‌లో దరఖాస్తులు పొందవచ్చు. ఆగస్టు 17, 2022 వ తేదీ సాయంత్రం 4 గంటలలోపు పూర్తి చేసిన దరఖాస్తులను సమర్పించాలి. ఆగస్టు 20వ తేదీన నిర్వహించే డెమోకు హాజరుకావల్సి ఉంటుంది. ఇతర సమాచారం కోసం 7901099784 ఫోన్‌ నంబర్‌కు కాల్‌ చేసి తెలుసుకోవచ్చు.

ఖాళీల వివరాలు:

  • పీజీటీ (ఐటీ, ఎకనామిక్స్, పొలిటికల్ సైన్స్, కామర్స్, తెలుగు, ఇంగ్లిష్) పోస్టులు: 7
  • టీజీటీ (తెలుగు, హిందీ, గణితం, ఫిజికల్ సైన్స్, బయో సైన్స్, ఇంగ్లిష్) పోస్టులు: 9
  • ఆర్ట్ టీచర్ పోస్టులు: 1
  • పీఈటీ పోస్టులు: 3
  • హాస్టల్ వార్డెన్ పోస్టులు: 2
  • స్టూడెంట్ కౌన్సెలర్ పోస్టులు: 2

పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి.

ఇవి కూడా చదవండి

మరిన్ని కెరీర్‌ సంబంధిత వార్తల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి.