హైదరాబాద్, నవంబర్ 1: తెలంగాణ రాష్ట్రంలోని హనుమకొండ ప్రగతినగర్‌లోని తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో నడుస్తున్న శ్రీ వెంకటేశ్వర బధిరుల పాఠశాలలో ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి తాజాగా నోటిఫికేషన్ విడుదలైంది. ఆ పాఠశాలలో ఎస్జీటీ గెస్ట్ ఉపాధ్యాయ పోస్టులకు అర్హులైన దరఖాస్తుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ప్రిన్సిపల్ లక్మీనర్సమ్మ ఓ ప్రకటనలో తెలిపారు. ఈ ప్రకటన కింద మొత్తం 3 ఎస్జీటీ టీచర్ పోస్టులను భర్తీ చేయనున్నారు. ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్ధులు బోర్డు ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ ఇంటర్, డిప్లొమా ఇన్ స్పెషల్ ఎడ్యుకేషన్ ఇన్ హియరింగ్ ఇంపియర్డ్ (డీఈడీ, హెచ్‌ఐ) తప్పనిసరిగా ఉత్తీర్ణత పొంది ఉండాలి. అలాగే టెట్‌లో అర్హత సాధించి ఉండాలని ఆయన అన్నారు.
తెలంగాణ రాష్ట్రానికి చెందిన అభ్యర్ధులు మాత్రమే దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఆసక్తి కలిగిన అభ్యర్థులు విద్యార్హతలు, వయసు, నివాసం, కులం, ప్రావీణ్యానికి సంబంధించి ఒరిజినల్ పత్రాలతో పాటు రెండు సెట్ల జిరాక్సు సర్టిఫికెట్లను తీసుకుని నవంబరు 5వ తేదీలోపు వరంగల్ ఎన్ఐటీ సమీపంలోని టీటీడీ బధిరుల పాఠశాలలో సమర్పించాల్సి ఉంటుంది. దరఖాస్తు చేసుకున్న వారికి నవంబర్ 6వ తేదీ ఉదయం 10 గంటల నుంచి ఇంటర్వ్యూ నిర్వహిస్తారు. ఇందుకు సంబంధించిన ఇతర వివరాలకు 9440739423 ఫోన్ నంబర్ ద్వారా పని వేళల్లో సంప్రదించవచ్చని పాఠశాల ప్రిన్సిపల్ కోరారు.
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లోని 13 ప్రభుత్వ సంగీత, నృత్య పాఠశాలలు, కళాశాలల్లో.. డిప్లొమా, సర్టిఫికెట్ కోర్సులకు సంబంధించిన వార్షిక పరీక్షల ఫలితాలను పొట్టి శ్రీరాములు తెలుగు యూనివర్సిటీ విడుదల చేసింది. వర్సిటీకి అనుబంధంగా ఉన్న కాలేజీల్లో జులైలో ఈ పరీక్షలను నిర్వహించిన సంగతి తెలిసిందే. వర్సిటీ ఉపాధ్యక్షుడు ప్రొఫెసర్ వెలుదండ నిత్యానందరావు చేతుల మీదగా ఫలితాలను ప్రకటించారు. ఈ సందర్భంగా ఆయన ఉత్తీర్ణులైన విద్యార్థులందరికీ శుభాకాంక్షలు తెలిపారు. పరీక్షల ఫలితాలను https://pstucet.org/ , https://www.manabadi.co.in/ వెబ్‌సైట్లలలో చూడవచ్చని పరీక్షల తెలిపారు.