TSPSC- RIMC 2023: టీఎస్‌పీఎస్సీ- ఆర్ఐఎంసీలో 8వ త‌ర‌గ‌తి 2023-24 ప్రవేశాలకు దరఖాస్తులు

|

Aug 13, 2023 | 9:36 PM

ఆర్ఐఎంసీ ప్రవేశ పరీక్షకు దరఖాస్తు చేసుకునే అభ్యర్ధులు ఏదైనా గుర్తింపు పొందిన పాఠశాల నుంచి 2024 జులై నాటికి ఏడో త‌ర‌గ‌తి చదువుతోన్న లేదా ఎడో త‌ర‌గ‌తిలో ఉత్తీర్ణులైన విద్యార్థులు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. అలాగే విద్యార్ధుల వయసు జులై 01, 2024 నాటికి ప‌ద‌కొండున్నర ఏళ్లకు త‌గ్గకుండా ప‌ద‌మూడేళ్లకు మించ‌కుండా వయసు ఉండాలి. అంటే జులై 2, 2011 నుంచి జనవరి 1, 2013 మ‌ధ్య జ‌న్మించిన వారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. ఆసక్తి కలిగిన వారు ఆఫ్‌లైన్‌ విధానంలో అక్టోబర్ 15, 2023వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవచ్చు. వెబ్‌సైట్‌ నుంచి డౌన్‌లోడ్‌ చేసుకున్న దరఖాస్తు ఫాంను పూర్తి చేసి..

TSPSC- RIMC 2023: టీఎస్‌పీఎస్సీ- ఆర్ఐఎంసీలో 8వ త‌ర‌గ‌తి 2023-24 ప్రవేశాలకు దరఖాస్తులు
TSPSC- RIMC
Follow us on

భార‌త ప్రభుత్వ ర‌క్షణ మంత్రిత్వశాఖ‌కు చెందిన ఉత్తరాఖండ్‌ రాష్ట్రం దెహ్రాడూన్‌లోని రాష్ట్రీయ ఇండియ‌న్ మిలిట‌రీ కాలేజీ (ఆర్ఐఎంసీ)లో జులై- 2024 ట‌ర్మ్‌ ఎనిమిదో త‌ర‌గ‌తి ప్రవేశాల‌కు దరఖాస్తులు కోరుతోంది. 8వ తరగతిలో ప్రశేశాలకు తెలంగాణ రాష్ట్రానికి చెందిన బాలురు, బాలికల నుంచి తెలంగాణ స్టేట్‌ ప‌బ్లిక్ స‌ర్వీస్ క‌మిష‌న్ (టీఎస్‌పీఎస్సీ) ద‌ర‌ఖాస్తులు ఆహ్వానిస్తోంది. ఆర్ఐఎంసీలో ఎనిమిదో త‌ర‌గ‌తి ప్రవేశాలు జులై- 2024 టర్మ్‌ రాత ప‌రీక్ష, వైవా వోస్‌, మెడిక‌ల్ ఎగ్జామినేషన్ ఆధారంగా విద్యార్థుల ఎంపిక చేసి ప్రవేశాలు కల్పించనున్నారు.

ఈ అర్హతలు అవసరం..

ఆర్ఐఎంసీ ప్రవేశ పరీక్షకు దరఖాస్తు చేసుకునే అభ్యర్ధులు ఏదైనా గుర్తింపు పొందిన పాఠశాల నుంచి 2024 జులై నాటికి ఏడో త‌ర‌గ‌తి చదువుతోన్న లేదా ఎడో త‌ర‌గ‌తిలో ఉత్తీర్ణులైన విద్యార్థులు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. అలాగే విద్యార్ధుల వయసు జులై 01, 2024 నాటికి ప‌ద‌కొండున్నర ఏళ్లకు త‌గ్గకుండా ప‌ద‌మూడేళ్లకు మించ‌కుండా వయసు ఉండాలి. అంటే జులై 2, 2011 నుంచి జనవరి 1, 2013 మ‌ధ్య జ‌న్మించిన వారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. ఆసక్తి కలిగిన వారు ఆఫ్‌లైన్‌ విధానంలో అక్టోబర్ 15, 2023వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవచ్చు. వెబ్‌సైట్‌ నుంచి డౌన్‌లోడ్‌ చేసుకున్న దరఖాస్తు ఫాంను పూర్తి చేసి అవసరమైన ధ్రువతపత్రాలు జతచేసి హైదరాబాద్‌లోని తెలంగాణ స్టేట్‌ ప‌బ్లిక్ స‌ర్వీస్ క‌మిష‌న్(టీఎస్‌పీఎస్సీ) కార్యాలయానికి పంపించాలి. దరఖాస్తు సమయంలో ద‌ర‌ఖాస్తు ఫీజు కింద జ‌న‌ర‌ల్ అభ్యర్థుల‌కు రూ.600, ఎస్సీ/ఎస్టీ కేటగిరీలకు చెందిన అభ్యర్థులు రూ.555 చెల్లించాల్సి ఉంటుంది. దరఖాస్తు ఫీజు ఆన్‌లైన్‌లో చెల్లించవచ్చు. రాత పరీక్ష డిసెంబర్‌ 15, 2023వ తేదీన ఉంటుంది.

ప‌రీక్షా విధానం ఇలా..

రాత ప‌రీక్ష మొత్తం మూడు పేప‌ర్లు ఉంటుంది. మ్యాథ‌మేటిక్స్‌లో 200 మార్కులకు, జ‌న‌ర‌ల్ నాలెడ్జ్ 75 మార్కులకు, ఇంగ్లిష్ 125 మార్కులకు ఉంటుంది. రాత పరీక్షలో అర్హత సాధించిన అభ్యర్థుల‌కు 50 మార్కులకు వైవా వోస్ ఉంటుంది. ఈ రెండింటికి కలిపి మొత్తం 450 మార్కులకు సెలక్షన్‌ ప్రాసెట్‌ ఉంటుంది. క‌నీసం 50 శాతం మార్కులతో ఉత్తీర్ణత సాధించిన వారికి చివ‌రిగా వైద్య పరీక్షలు నిర్వహిస్తారు.

ఇవి కూడా చదవండి

నోటిఫికేషన్‌ కోసం క్లిక్‌ చేయండి.

పూర్తి సమాచారం కోసం క్లిక్‌ చేయండి.

మరిన్ని తాజా విద్యా, ఉద్యోగ సమాచారం కోసం క్లిక్‌ చేయండి.