హైదరాబాద్, జులై 17: తెలంగాణ భూగర్భజలశాఖలో వివిధ నాన్‌గెజిటెడ్ పోస్టుల భర్తీకి సంబంధించిన హాల్ టికెట్లు విడుదలయ్యాయి. ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్ధులు టీఎస్పీయస్సీ అధికారిక వెబ్‌సైట్ నుంచి హాల్ టికెట్లను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. పరీక్ష జులై 20, 21 తేదీల్లో ఆన్‌లైన్ విధానంలో నిర్వహిస్తారు. పరీక్ష నమూనా లింకును సైతం వెబ్‌సైట్‌లో పొందుపరిచినట్లు కమిషన్ పేర్కొంది.
రోజుకు రెండు షిఫ్టు్ల్లో పరీక్ష నిర్వహిస్తారు. మార్నింగ్ షిఫ్ట్ ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు ఉంటుంది. రెండో షిఫ్ట్ మధ్యాహ్నం 2.30 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఉంటుంది. కాగా మొత్తం 32 పోస్టుల భర్తీకి ఈ నియామకి ప్రక్రియ చేపట్టారు.
మరిన్ని తాజా విద్యా, ఉద్యోగ సమాచారం కోసం క్లిక్ చేయండి.