TGPSC Group 2 Exam: టీజీపీఎస్సీ గ్రూప్‌-2 పరీక్షల షెడ్యూల్‌ విడుదల.. కొత్త తేదీలు ఇవే

|

Aug 23, 2024 | 6:28 AM

తెలంగాణలో గ్రూప్‌ 2 పరీక్షలకు సంబంధించిన షెడ్యూల్‌ను టీజీపీఎస్సీ విడుదల చేసింది. డిసెంబర్‌ 15, 16 తేదీల్లో ఈ పరీక్షలు నిర్వహించనున్నట్లు పేర్కొంది. రోజుకు రెండు సెషన్ల చొప్పున ఉదయం, మధ్యాహ్నం వేళల్లో ఈ పరీక్షలు నిర్వహించనున్నారు. మొత్తం 783 గ్రూప్‌ 2 పోస్టుల భర్తీకి ఈ నియామక ప్రక్రియ చేపడుతున్నారు. తొలుత ప్రకటించిన షెడ్యూల్‌ ప్రకారమైతే....

TGPSC Group 2 Exam: టీజీపీఎస్సీ గ్రూప్‌-2 పరీక్షల షెడ్యూల్‌ విడుదల.. కొత్త తేదీలు ఇవే
TGPSC Group 2 Exam
Follow us on

హైదరాబాద్‌, ఆగస్టు 23: తెలంగాణలో గ్రూప్‌ 2 పరీక్షలకు సంబంధించిన షెడ్యూల్‌ను టీజీపీఎస్సీ విడుదల చేసింది. డిసెంబర్‌ 15, 16 తేదీల్లో ఈ పరీక్షలు నిర్వహించనున్నట్లు పేర్కొంది. రోజుకు రెండు సెషన్ల చొప్పున ఉదయం, మధ్యాహ్నం వేళల్లో ఈ పరీక్షలు నిర్వహించనున్నారు. మొత్తం 783 గ్రూప్‌ 2 పోస్టుల భర్తీకి ఈ నియామక ప్రక్రియ చేపడుతున్నారు. తొలుత ప్రకటించిన షెడ్యూల్‌ ప్రకారమైతే.. ఆగస్టు 7, 8 తేదీల్లో పరీక్షలు నిర్వహించాల్సి ఉంది. అయితే.. డీఎస్సీ, గ్రూప్‌-2 పరీక్షల మధ్య వారం రోజులు మాత్రమే వ్యవధి ఉండటంతో పాలు కారణాల రిత్య ఇప్పటి వరకు మూడు సార్లు వాయిదా పడ్డాయి. దీంతో గ్రూప్‌-2 పరీక్షల కొత్త షెడ్యూల్‌ను కమిషన్‌ మరోమారు తాజాగా ప్రకటించింది.

టీజీపీఎస్సీ గ్రూప్‌ 2 పరీక్షల కొత్త షెడ్యూల్‌ ఇదే

  • డిసెంబర్‌ 15వ తేదీన ఉదయం 10 నుంచి 12:30 వరకు పేపర్-1 పరీక్ష ఉంటుంది
  • డిసెంబర్‌ 15వ తేదీన మధ్యాహ్నం 3 నుంచి 5:30 వరకు పేపర్‌-2 పరీక్ష ఉంటుంది
  • డిసెంబర్‌ 16వ తేదీన ఉదయం 10 నుంచి 12:30 వరకు పేపర్-3 పరీక్ష ఉంటుంది
  • డిసెంబర్‌ 16వ తేదీన మధ్యాహ్నం 3 నుంచి 5:30 వరకు పేపర్‌-4 పరీక్ష ఉంటుంది

కాగా మొత్తం 18 విభాగాల్లో 783 పోస్టులతో టీజీపీఎస్సీ గత ఏడాది గ్రూప్‌ 2 ఉద్యోగ ప్రకటన జారీచేసిన సంగతి తెలిసిందే. ఇందుకు సంబంధించి 2023 జనవరి 18 నుంచి ఫిబ్రవరి 16 వరకు దరఖాస్తులు స్వీకరించింది. రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 5,51,943 మంది అభ్యర్థులు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే మూడు సార్లు వివిధ కారణాలతో గ్రూప్‌ 2 వాయిదా పడింది. మరోవైపు రాష్ట్రంలో అధికారం చేపట్టిన రేవంత్‌ సర్కార్‌ ఎన్నికల ముందు ఇచ్చిన హామీ మేరకు గ్రూప్‌ 2 పోస్టుల సంఖ్య పెంచాలంటూ నిరుద్యోగులు డిమాండ్‌ చేస్తున్నారు. అయితే దీనిపై ప్రభుత్వం మాత్రం నిమ్మకునీరెత్తినట్లు ఉంది. తాజాగా పరీక్షల షెడ్యూల్‌ విడుదలవడంతో నిరుద్యోగుల ఆశలపై నీళ్లు చల్లినట్లైంది. గత డీఎస్సీలో కూడా ఇలాంటి సంఘటనే జరిగింది. డీఎస్సీ పరీక్షలను నెల రోజుల పాటు వాయిదా వేయాలని రాష్ట్ర వ్యాప్తంగా నిరుద్యోగులు నిరసనలు చేపట్టిన కనీసం పట్టించుకోలేదు సరికదా.. మొండి వైఖరితో హాల్‌ టికెట్లు విడుదల చేసి తొలుత ప్రకటించిన తేదీల ప్రకారమే పరీక్షలు నిర్వహించింది. ఇక గ్రూప్‌ 2 పోస్టుల పెంపు విషయంలో కూడా సర్కార్‌ నిరుద్యోగులకు వంచించే యత్నం చేస్తుందని పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని విద్యా, ఉద్యోగ కథనాల కోసం క్లిక్‌ చేయండి.