TSPSC Group 1Final Key విడుదల.. 5 ప్రశ్నల తొలగింపు.. మార్కులు ఎలా కేటాయిస్తారంటే..

|

Nov 17, 2022 | 6:24 AM

తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 503 గ్రూప్‌ 1 పోస్టులకు అక్టోబర్‌ 16న నిర్వహించని ప్రిలిమినరీ పరీక్షకు సంబంధించిన తుది ఆన్సర్‌ 'కీ'  మంగళవారం విడుదలైంది. గ్రూప్ 1 ప్రిలిమినరీ ఆన్సర్‌ 'కీ'లో..

TSPSC Group 1Final Key విడుదల.. 5 ప్రశ్నల తొలగింపు.. మార్కులు ఎలా కేటాయిస్తారంటే..
TSPSC Group-1 Final Answer Key
Follow us on

తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 503 గ్రూప్‌ 1 పోస్టులకు అక్టోబర్‌ 16న నిర్వహించని ప్రిలిమినరీ పరీక్షకు సంబంధించిన తుది ఆన్సర్‌ ‘కీ’  మంగళవారం విడుదలైంది. గ్రూప్ 1 ప్రిలిమినరీ ఆన్సర్‌ ‘కీ’లో ఐదు ప్రశ్నలను తొలగించినట్లు కమిషన్‌ పేర్కొంది. మరో రెండు ప్రశ్నలకు రెండు కన్నా ఎక్కువ సమాధానాలు సరైనవిగా ప్రకటించింది. అక్టోబర్‌ 29న విడుదలైన గ్రూప్‌ 1 ప్రైమరీ ఆన్సర్‌ ‘కీ’పై వచ్చిన అభ్యంతరాల నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకుంది.

అక్టోబర్‌ 30 నుంచి నవంబరు 4 వరకు స్వీకరించిన అభ్యంతరాలను సబ్జెక్టు ఎక్స్‌పర్ట్స్‌ కమిటీ పరిశీలించి.. 5 ప్రశ్నలను తొలగించింది. గ్రూప్‌-1 ప్రిలిమినరీ మాస్టర్‌ ప్రశ్నపత్రం ప్రకారం 29, 48, 69, 82, 138 ప్రశ్నలను తొలగించింది. 107వ ప్రశ్నకు ఆప్షన్‌ 1 లేదా 2 లేదా 3 లేదా 4లో ఏది పేర్కొన్నా ఒక మార్కు ఇవ్వనుంది. అలాగే 133వ ప్రశ్నకు ఒకటి లేదా రెండు ఈ రెండింటిలో ఏ ఆప్షన్‌ గుర్తించినా మార్కలు ఇస్తారు. 57వ ప్రశ్నకు సమాధానాన్ని మార్చి ఆప్షన్‌ ఒకటిగా సవరించింది. ఈ విధంగా గ్రూప్‌-1 పరీక్షలో మొత్తం 150 మార్కులకు 5 ప్రశ్నలను తొలగించడంతో 145 ప్రశ్నలకు వచ్చిన మార్కులను పరిగణనలోకి తీసుకోనున్నారు. ఒక్కో ప్రశ్నకు 1.034 మార్కులను కేటాయించి దమాషా పద్ధతిలో తుది ఫలితాలను ప్రకటిస్తారు. నవంబర్‌ 29వ తేదీ వరకు ఓఎంఆర్‌ షీట్లను వెబ్‌సైట్లో అందుబాటులో ఉంటాయని, అభ్యర్ధులు లాగిన్‌ అయ్యి డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చని కమిషన్‌ తెల్పింది. ఈ పరీక్షను 2,86,051 మంది రాశారు. ఒక్కో పోస్టుకు 50 మంది చొప్పున మెయిన్స్‌కు ఎంపిక చేయనున్నారు.

TSPSC Group-1 Prelims 2022 Final Answer Key

దమాషా పద్ధతి అంటే..

ఒక అభ్యర్థికి 120 మార్కులు వచ్చాయనుకుందాం. ప్రిలిమినరీలో ఐదు ప్రశ్నలు తొలగించినందున, మిగతా 145 ప్రశ్నలకు ఒక మార్కు చొప్పున మొత్తం 145 మార్కులకు 120 వచ్చినట్లు అవుతుంది. తుది మెరిట్‌ను మాత్రం దామాషా పద్ధతిలో 150 మార్కులకు లెక్కిస్తారు. మొత్తం 145 మార్కులకు 120 మార్కులు వచ్చినట్లైతే.. ఈ లెక్కన 150 మార్కులకు ఎలా స్కోరు కడతారంటే.. 150/145 x 120=124.137గా లెక్కిస్తారు. ఫలితాల ప్రకటనలో 124.137 మార్కులు వస్తాయి. ఈ విధంగా ప్రతి ఒక్కరికి మార్కులను కేటాయించి తుది జాబితాను తయారు చేస్తారు. అనంతరం పైనల్‌ రిజల్ట్స్‌ విడుదల చేస్తారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని తాజా విద్యా, ఉద్యోగ సమాచారం కోసం క్లిక్‌ చేయండి.