తెలంగాణ గ్రూప్-1 ప్రిలిమినరీ పరీక్ష ప్రైమరీ ఆన్సర్ ‘కీ’ రేపు (అక్టోబర్ 29) విడుదలవ్వనుంది. ప్రైమరీ ఆన్సర్ కీతోపాటు ఓఎంఆర్ షీట్ ఇమేజ్ స్కానింగ్‌లను కూడా వెబ్‌సైట్‌లో ఉంచేందుకు కమిషన్ సన్నాహాలు చేస్తోంది. ఇప్పటికే ఓఎంఆర్ ఆన్సర్ షీట్‌ల ఇమేజ్ స్కానింగ్ దాదాపు పూర్తయ్యినట్లు సమాచారం. టీఎప్పీయస్సీ గ్రూప్-1 ఆన్సర్ కీ విడుదలైన తర్వాత అభ్యర్ధుల నుంచి అభ్యంతరాలను లేవనెత్తడానికి 5 రోజుల గడువు ఇవ్వనుంది. ఐతే ఎవ్వరి నుంచి అభ్యంతరాల నమోదు లేకుండే మూడు రోజుల్లోనే ఫైనల్ ఆన్సరీ కీని కూడా విడుదల చేయనుంది. ఫైనల్ కీ తర్వాత రెండునెలల్లోపు ప్రిలిమినరీ ఫలితాలను విడుదల చేస్తామని టీఎస్సీయస్సీ ఇప్పటికే ప్రకటించారు.
కాగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 503 గ్రూప్-1 పోస్టులకుగానూ ప్రిలిమినరీ పరీక్ష అక్టోబర్ 16న నిర్వహించిన సంగతి తెలిసిందే. ఈ పోస్టులకు మొత్తం 3 లక్షల 80 వేల మంది దరఖాస్తు చేసుకోగా, 2 లక్షల 86 వేల 51 మంది పరీక్షకు హాజరయ్యారు. ఐతే స్క్రీనింగ్ టెస్ట్ అయిన ప్రిలిమ్స్ కఠినంగా ఉండటంతో కటాఫ్ మార్కులు కటాఫ్ 75 నుంచి 85 మధ్యలో ఉండే అవకాశం ఉందని నిపుణులు భావిస్తున్నారు.
మరిన్ని కెరీర్ సంబంధిత వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.