TSPSC Recruitment 2022: రాత పరీక్షలేకుండా.. ములుగు ఫారెస్ట్ కాలేజ్‌లో టీచింగ్‌ ఉద్యోగాలు..నెలకు రూ.లక్షకుపైగా జీతం..

|

Aug 24, 2022 | 7:54 AM

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి చెందిన ములుగు జిల్లాలోని ఫారెస్ట్ కాలేజ్ అండ్‌ రిసెర్చ్ ఇన్‌స్టిట్యూట్‌ (FCRI Mulugu)లోని వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న 27 టీచింగ్‌ పోస్టుల (Teaching Posts) భర్తీకి అర్హులైన..

TSPSC Recruitment 2022: రాత పరీక్షలేకుండా.. ములుగు ఫారెస్ట్ కాలేజ్‌లో టీచింగ్‌ ఉద్యోగాలు..నెలకు రూ.లక్షకుపైగా జీతం..
Fcri Mulugu
Follow us on

TSPSC-FCRI Mulugu Professor Recruitment 2022: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి చెందిన ములుగు జిల్లాలోని ఫారెస్ట్ కాలేజ్ అండ్‌ రిసెర్చ్ ఇన్‌స్టిట్యూట్‌ (FCRI Mulugu)లోని వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న 27 టీచింగ్‌ పోస్టుల (Teaching Posts) భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతూ తెలంగాణ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ నోటిఫికేషన్‌ విడుదల చేసింది. వీటిల్లో ప్రొఫెసర్ పోస్టులు 2, అసోసియేట్ ప్రొఫెసర్ పోస్టులు 4, అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులు 21 ఉన్నాయి. వైల్డ్ లైఫ్ మేనేజ్‌మెంట్, నేచురల్ రిసోర్స్ మేనేజ్‌మెంట్, అగ్రికల్చరల్ ఎకనామిక్స్, ఫారెస్ట్ యుటిలైజేషన్, సాయిల్ సైన్స్ అండ్ అగ్రికల్చరల్ కెమిస్ట్రీ, ట్రీ బ్రీడింగ్ అండ్ ఇంప్రూవ్‌మెంట్, జియో ఇన్ఫర్మేటిక్స్, అగ్రో ఫారెస్ట్రీ, సీడ్ సైన్స్ అండ్‌ టెక్నాలజీ, ఫారెస్ట్ మేనేజ్‌మెంట్, అగ్రికల్చరల్ స్టాటిస్టిక్స్, అగ్రో ఫారెస్ట్రీ, బోటనీ, కంప్యూటర్ సైన్స్/ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఎన్విరాన్‌మెంటల్ ఇంజినీరింగ్, ఫారెస్ట్రీ, ఉడ్ సైన్స్ అండ్ టెక్నాలజీ, ఫారెస్ట్ బయాలజీ, ఫారెస్ట్ జెనెటిక్ రిసోర్సెస్, వైల్డ్ లైఫ్ సైన్స్ విభాగాల్లో ఖాళీలున్నాయి.

ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్ధులకు పోస్టును బట్టి సంబంధిత స్పెషలైజేషన్‌లో ఎంఎస్సీ, ఎంసీఏ, ఎంటెక్‌, ఎంవీఎస్సీ, పీహెచ్‌డీలో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. అలాగే సంబంధిత సబ్జెక్టులో టీచింగ్‌, రీసెర్చ్‌ అనుభవం కూడా ఉండాలి. జులై 1, 2022వ తేదీ నాటికి అభ్యర్ధుల వయసు 21 నుంచి 61 యేళ్ల మధ్య ఉండాలి. ఈ అర్హతలున్నవారు ఆన్‌లైన్‌ విధానంలో సెప్టెంబర్‌ 27, 2022వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తు ప్రక్రియ సెప్టెంబర్‌ 6, 2022 నుంచి ప్రారంభమవుతుంది. దరఖాస్తు సమయంలో ప్రతి ఒక్కరు తప్పనిసరిగా రూ.500లు అప్లికేషన్‌ ఫీజు చెల్లించవల్సి ఉంటుంది. అకడమిక్‌ మెరిట్, అనుభవం, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక ఉంటుంది. ఎంపికైన వారికి ఈ కింది విధంగా జీతభత్యాలు ఉంటాయి.

  • ప్రొఫెసర్ పోస్టులు 1,44,200
  • అసోసియేట్ ప్రొఫెసర్ పోస్టులు1,31,400
  • అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులు 57,700

పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి.

ఇవి కూడా చదవండి

మరిన్ని తాజా విద్యా, ఉద్యోగ సమాచారం కోసం క్లిక్‌ చేయండి.